close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి
తిరుమలగిరి: మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి పక్కనే ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌,
జడ్పీ ఛైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక

శాలిగౌరారం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొవిడ్‌ సంక్షోభంలోనూ తెరాస ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా గురువారం హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతుబంధు, రైతు బీమా పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతలకు ఆపద్బాంధవుడు అయ్యారని పేర్కొన్నారు. ఛైర్‌పర్సన్‌గా కట్టా లక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌గా గుజిలాల్‌ శేఖర్‌బాబు, డైరెక్టర్లుగా సిరుపంగి సత్యయ్య, గాదె ఆర్లారెడ్డి, సుల్తాన్‌ శ్రీనివాస్‌, కుంభం రమేష్‌, జంగిలి వీరస్వామి, నర్సిరెడ్డి ప్రమాణం చేశారు.

ముఖ్యమంత్రి నిర్ణయాలతో రైతుల్లో సంతోషం

తిరుమలగిరి: వ్యవసాయంపై ముఖ్యమంత్రి నిర్ణయాల కారణంగా రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరిమార్కెట్‌ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంవలో మాట్లాడారు.ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ నూతన పాలకవర్గం మార్కెట్‌ను అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పారు. మార్కెట్‌ కార్యదర్శి శంశేర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఛైర్మన్‌గా మూల అశోక్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా గుండగాని అంబయ్య, డైరెక్టర్‌లుగా శీల యాదగిరి, లకావత్‌ సునిత, కొప్పుల సోమిరెడ్డి, బందెల ఆర్వపల్లి, గోసుల విజయ్‌కుమార్‌, కారుపోతుల అంజయ్య, ఇమ్మడి సోమనర్సయ్య, శర్విరాల సుధాకర్‌, ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో సూర్యాపేట జడ్పీ ఛైర్‌పర్సన్‌ దీపిక, ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ రామకృష్ణారెడ్డి, రైసస జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌కె.రజాక్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రజని, వైస్‌ ఛైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ సభ్యురాలు అంజలి, ఎంపీపీ లక్ష్మమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు రణీల, అయితగోని వెంకన్నగౌడ్‌, మురళి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.