close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జరిగిందొకటి.. దొరికిందొకటి

చివ్వెంల, న్యూస్‌టుడే: ప్రమాదం జరిగిందని అక్కడికి వెళ్లిన పోలీసులకు మరో విషయం తెలియటంతో అవాక్కైన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురం వద్ద గురువారం జరిగింది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు గాయపడ్డారు. విజయవాడ నుంచి తన ద్విచక్రవాహనంపై యువకుడు వెళుతుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడి వద్ద సుమారు 20 కిలోల గంజాయి దొరకటంతో పోలీసులు అవాక్కైనట్లు సమాచారం. క్షతగాత్రుడిని సూర్యాపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ద్విచక్రవాహనం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై లోకేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.