close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
మృతి చెందిన సంతోష్‌

చేపల వేటకు వెళ్లి యువకుడు..

రావికుంటతండా (మోతె): పాలేరు వాగులో చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మోతె మండలం రావికుంట తండా సమీపంలో గురువారం జరిగింది. మోతె హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా.. ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం సోలిపురం పంచాయతీ పరిధిలోని మంగలితండాకు చెందిన ఎ.సంతోష్‌ (22) కొందరితో కలిసి పాలేరు వాగులో చేపలు పట్టేందుకు వచ్చారు. వాగులోకి దిగి పట్టుతప్పి సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు వచ్చి కేసు, పంచనామా వద్దంటూ మృతదేహాన్ని మంగలితండాకు తరలించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి గతంలో విద్యుత్తు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది.



నాథు (పాతచిత్రం)

చికిత్స పొందుతూ..

మిర్యాలగూడ గ్రామీణం: భూ వివాదంలో జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఎస్సై పి.పరమేశ్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కెళ్లపాడుతండా పంచాయతీ జగ్గుతండాకు చెందిన భూక్యా దేవోజి కుటుంబ పెద్దలు మాడ్గులపల్లి మండలం సీత్యాతండాకు చెందిన ఆయన చెల్లెలైన సాజికి 30 గుంటల భూమిని కేటాయించారు. సాజి మృతి అనంతరం దేవోజి కుటుంబ సభ్యులు ఆ భూమి తమదేఅ నడంతో ఇరుకుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అది కోర్టులో ఉండగానేఈ నెల 10న భూక్యా దేవోజి కుటుంబ సభ్యులు పొలంలో నాటేసేందుకు ప్రయత్నించగా మేనల్లుళ్లైన వాంకుడోతు నాథు(37), నాగేందర్‌, భగవాన్‌లు అడ్డుకున్నారు. అదే రోజు పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా దేవోజి కుమారుడు భూక్యా మదన్‌ రాయితో నాథు, నాగేందర్‌పై దాడి చేశాడు. నాథు గాయపడటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాథు గురువారం మృతి చెందాడు. ఆయనకు భార్య, 15 నెలల కుమారుడు ఉన్నాడు.


లారీని ఢీకొని ..

సూర్యాపేట గ్రామీణం: ఆగిన లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమాంపేటకు చెందిన నాగబోయిన రమేష్‌(28) పాటు అతడి స్నేహితులు పవన్‌, సతీష్‌ కలిసి ఇమాంపేట వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గురుకుల పాఠశాల ఎదుట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో రమేష్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ..

నార్కట్‌పల్లి గ్రామీణం: ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి గాయాలైన ఘటన నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై చెర్వుగట్టులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన రింజీల్‌(21), అహ్మద్‌ కొన్ని నెలలుగా నార్కట్‌పల్లిలోని జేసీబీ చోదకులుగా పని చేస్తున్నారు.యల్లారెడ్డిగూడెం శివారులోని ఓ దాబాకు ద్విచక్రవాహనంపై అపసవ్య మార్గంలో వెళ్తూ నల్గొండ నుంచి నార్కట్‌పల్లి వైపు వెళుతున్న చీరాలకు చెందిన రాజేష్‌, ప్రేమ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో రింజీల్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మరో ద్విచక్రవాహనం నడుపుతున్న రాజేష్‌ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.


పుట్టింటికి తీసుకెళ్లడం లేదని వివాహిత ఆత్మహత్య

తెనాలి టౌన్‌: తనను పుట్టింటికి తీసుకెళ్లమంటే భర్త పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తెనాలి, చెంచుపేటలో జరిగింది. మూడో పట్టణ పోలీసులు గురువారం తెలిపిన వివరాలిలా.. హేమాలాల్‌నాయక్‌, కల్యాణి (23) దంపతులకు ఇద్దరు పిల్లలు. కొద్ది రోజుల నుంచి కల్యాణి నల్గొండ జిల్లాలోని తన పుట్టింటికి వెళదామని భర్తను కోరుతోంది. కరోనా వల్ల తర్వాత వెళదామని భర్త చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం హేమాలాల్‌నాయక్‌ విధులకు వెళ్లిపోయారు. మనస్తాపంతో కల్యాణి పిల్లలను బయటకు పంపి తాను ఉరి వేసుకుంది.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.