close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్‌...

ఈనెల 16 తరువాత రాక

ఉమ్మడి జిల్లాకు 11.71 లక్షలు అవసరం

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే కానుకలను ప్రభుత్వం ఇప్పుడే సిద్ధం చేస్తోంది. ఆడపడుచులకు పంపిణీ చేయాల్సిన చీరలు ఈనెల 16 తరువాత జిల్లాకు చేరుకోనున్నాయి. వాటిని మార్కెట్‌ యార్డులో భద్రపరుస్తారు. ఉమ్మడి జిల్లాలోని అర్హులైన 18 ఏళ్లు నిండిన మహిళలు అధికారిక లెక్కల ప్రకారం 1,171,306 ఉన్నారు. ఈ లెక్కన జిల్లాకు పంపించనున్నారు. వీటిని గోదాముల్లో ముందస్తుగా భద్రపరుచనున్నారు. గోదాములను శుభ్రం చేయాలని అధికారులు సిబ్బందికి తెలిపారు. సిరిసిల్ల నుంచి విడతల వారీగా గోదాములకు పంపుతారు. అనంతరం కావాల్సిన మేర పట్టణాలకు మండలాలకు పంపనున్నారు.

బతుకమ్మ సంబరాలు వచ్చాయంటే చాలు తెలంగాణ ఆడపడుచుల్లో ఎక్కడాలేని ఆనందం కనిపిస్తుంది. అందులో భాగంగా కొత్త బట్టలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వమే మహిళలకు కానుకల రూపంలో చీరల పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆహార భద్రతకార్డు ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన మహిళలకు చీరలు పంపిణీ చేస్తోంది. ఈసారి అదే తరహాలో చీరల పంపిణీకి అధికార యం త్రాంగం కసరత్తు చేస్తోంది. బతుకమ్మ పండగ నాటికి అర్హత కలిగిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా నేపథ్యంలో...

కరోనా నేపథ్యంలో ఎలా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారే అధికారుల సమక్షంలో పంపిణీ చేయించాలా అని చర్చించుకుంటున్నారు. బతకమ్మ పండగ మహిళలతో ఏటా నిర్వహించినట్లు చేయడం వీలు పడదని అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద నిర్వహించాలా అనే నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించనుంది.

జిల్లాల నుంచి పంపిన లెక్కలతోనే...

బతుకమ్మ చీరల ప్రతిపాదనలను తెలంగాణ హ్యండ్లూమ్‌ వీవర్‌ కోపరేటివ్‌ సొసైటీ ఎండీకి పంపారు. అక్టోబర్‌లో వచ్చే బతుకమ్మ పండగ కోసం రంగురంగుల వంద డిజైన్లతో చీరలను తయారీ చేస్తున్నారు. ఆరు మీటర్ల చీరలను తయారు చేసి కవర్లలో ప్యాక్‌ చేసి పంపుతారు. ఈ చీరల తయారీతో పలువురికి ఉపాధి లభిస్తుంది.

ప్రతిపాదనలు పంపాం : ఎండీ.జహీరుద్దీన్‌, ఏడీ 6చేనేత జౌళిశాఖ నల్గొండ

బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ నెల 16 తరువాత జిల్లాకు రానున్నాయి. గోదాముల్లో భద్రపరిచిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాలతో పంపిణీ జరుగుతుంది.

మంచి కార్యక్రమం

- బొబ్బిలి స్వరూపరెడ్డి, తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు, నల్గొండ.

తెరాస ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ మంచి కార్యక్రమం. ఆడపడుచులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. పలు డిజైన్‌లలో ముద్రిస్తున్నారు. ఇది ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.