close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

అలరించిన సీఐటీయూ సాంస్కృతిక వైభవోత్సవాలు

ఆకట్టుకున్న వక్తల ప్రసంగాలు

 పాటతో ఉర్రూతలూగించిన ఆర్‌.నారాయణమూర్తి


నెల్లూరు : వీఆర్‌సీ మైదానంలో జరిగిన సీఐటీయూ 15వ రాష్ట్ర మహా సభలో కళాకారులతో

కలిసి డప్పు కొడుతున్న నటుడు ఆర్‌. నారాయణమూర్తి, తదితరులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా నగరంలోని వీఆర్‌సీ క్రీడామైదానంలో సీఐటీయూ సాంస్కృతిక వైభవోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో భాగంగా మొదటి రోజు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్మికుల కష్టాలు, వారు పడుతున్న బాధలతో కళాకారులు పాడిన పలు పాటలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన సినీ నటుడు, అభ్యుదయవాది ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను నివారించాలని, రైతులకు లాభాలు వచ్చేలా స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కందారపు మురళి మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు ఫలితంగా కార్మిక చట్టాలను తెచ్చుకోగలిగామని నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కాలరాస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం సినీనటుడు ఆర్‌.నారాయణ మూర్తి పాడిన పాట ప్రజలను ఉర్రూతలూగించింది. ‘ఊరుమనది రా...ఈ వాడమనదిరా..’ అంటూ సాగిన ఆయన పాటకు ప్రజలు కేరింతలు కొట్టారు. ఇందులో భాగంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఏడుకొండలు హరికథ, యోగివేమన శతకం దృశ్యరూపకం ఎంతగానో ఆకట్టుకుంది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రముఖ గాయని మంగ్లీచే పాటల కార్యక్రమం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సంఘ గౌరవాధ్యక్షుడు చలంచర్ల భాస్కర్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు.

మహాసభల విజయవంతానికి పిలుపు

నెల్లూరు (విద్య) : నగరంలోని వీఆర్‌సీ క్రీడామైదానంలో జరిగే సీఐటీయూ 15వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ సభలు జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ సభలను అన్నిరంగాల కార్మికులు, అన్ని సంఘాల నేతలు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. దీనికి సీఐటీయూ జాతీయ, రాష్ట్ర నేతలతోటి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ.రాఘవులు, ప్రజాకవి గోరేటి వెంకన్న, సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి, సినీ గేయరచయిత సుద్దాల ఆశోక్‌తేజ, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, గాయిని మంగ్లీ, పలువురు సినీ ప్రముఖులు రానున్నారన్నారు. ఈ రాష్ట్ర సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై అవలంభిస్తున్న తీరుకు తీర్మానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి శ్రీనివాసులు, ఆటోకార్మిక సంఘ నేత సురేష్‌, ఆర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి..

కళాకారుల వాయిద్యాలు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.