close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

మారిన పురపాలక వార్డుల హద్దులు

వెంకటగిరి, కావలి పట్టణ ముఖచిత్రాల్లో స్వల్ప మార్పు

వెంకటగిరి, కావలిపట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలోని వెంకటగిరి, కావలి మున్సిపాలిటీలలోని వార్డుల హద్దులు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ రెండు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. గతంలోనే వార్డుల హద్దులు మారుస్తూ పునర్విభజన చేసి మున్సిపల్‌ పరిపాలన విభాగం, ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రభుత్వ కార్యదర్శి గోపాల్‌ ద్వివేది జీవో నెం 310 విడుదల చేశారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల హద్దులు మారాయి. ఇక్కడ ఉన్న ప్రతి వార్డు పరిధిలో దాదాపు రెండేసి వేలు, 1,800 ఓట్లు ఉన్నాయి. మరికొన్ని వార్డులో తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అధికారులు ఓట్ల సంఖ్యను సవరిస్తూ వార్డులను పునర్విభజన చేశారు. ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలా చర్యలు చేపట్టారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులు యథావిధిగా ఉన్న గతంలో ఉన్న ఓటర్లు మారడంతో సహా హద్దులు కూడా మారాయి. కావలి మున్సిపాలిటీ పరిధిలో వార్డు హద్దులు మారుస్తూ జీవో నెం 309 విడుదల చేశారు. కావలి మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో ఉన్న ఓటర్లను మార్చడంతో సహా హద్దులు మార్చారు. కావలిలో కూడా గతంలో 40 వార్డులు ఉన్నా పునర్విభజనలో వార్డుల సంఖ్య పెరగలేదు. కేవలం హద్దులు మార్పులు జరిగాయి. వీటిపై ఏమైనా ప్రభుత్వ పరంగా అభ్యంతరాలు ఉంటే జిల్లా పరిపాలనాధికారి వారం రోజుల లోగా నివేదికలు ఇవ్వాలని జీవోలో సూచించారు. వార్డు ముఖచిత్రాలు మారాయి. ఇప్పటి వరకు ఆయా వార్డుల పరిధిలో పట్టు ఉన్న నేతలు రానున్న ఎన్నికలు నాటికి పునర్విభజనతో హద్దులు మారిన ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచి కసరత్తు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.