close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

కాలువ తవ్వారు.. చెరువులను ముంచారు


కొండలపై నుంచి వస్తున్న నీటి ఉద్ధృతికి తెగిన ఎస్‌ఎస్‌ కాలువ

న్యూస్‌టుడే, వెంకటగిరి : చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో 2006్చలో సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలువ నిర్మాణం చేపట్టేందుకు మూడు ప్యాకేజీలుగా విభజించారు. తొలి రెండు ప్యాకేజీ పనులు ఆసంపూర్తిగా నిలిపేశారు. మూడో ప్యాకేజీ పనులను డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లో చేపట్టారు. గుత్తేదారులు రెండు మండలాలు పరిధిలో కాలువ నిర్మాణం పనులు చేపట్టారు. ఇంత వరకు బాగున్నా ప్రస్తుతం కాలువలు కింద భాగంలో ఉన్న చెరువులు నిండే పరిస్థితి లేకుండా పోయింది. వెలిగొండలపై పడిన ప్రతి వర్షపు నీటి బొట్టు వరద రూపంలో ప్రవహించి రెండు మండలాలు పరిధిలో ఉన్న చెరువులకు నీరు అందిస్తోంది. ఈ కాలువ అడ్డుగా నిర్మాణం చేయడంతో ఈ నీరంతా వృథాగా కాలువలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు దాదాపు అనేక చెరువులు నిండకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు కురిసిన కొండ కింద గ్రామాలకు చెందిన రైతులు పంటసాగు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. కారణం చెరువులు నిండకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. కొండలపై కురిసిన నీరు చెరువులకు వెళ్లేలా ఎస్‌ఎస్‌ కాలువపై అడ్డుగా కాలువ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా సరైన చర్యలు లేకపోవడంతో ఈ నీరంతా కాలువలోకి వృథాగా చేరాయి. రెండు మండలాల పరిధిలో తీర్థంపాడు, సిద్దవరం, టి.బి.పల్లి, మన్నేగుంట, పారవోలు, వెంకటగిరి, బాలసముద్రం తదితర గ్రామాల పరిధిలో కొండలపై నుంచి ప్రవహించే నీరు చెరువులకు వెళ్లేవి. ఎస్‌ఎస్‌కాలువ అడ్డుగా నిర్మాణం చేయడంతో కాలువపై నీరు వెళ్లేలా అడ్డుగా కాలువ నిర్మాణాలు వెడల్పుగా చేపట్టాల్సి ఉంది. కానీ సిద్దవరం గ్రామం వద్ద నిర్మించిన కాలువ కొండలపై ప్రవహించే వరద వేగానికి తట్టుకునే పరిస్థితి లేక ఇతర మార్గాలు గుండా నీరు ప్రవహించడంతో ఇక్కడే నాలుగు ప్రాంతాల్లో కాలువ కట్టను తెంచింది. టి.బి.పల్లి వద్ద నిర్మించిన వరవ కాలువ తక్కువ ఎత్తులో నిర్మాణం చేయడం, వెడల్పు తగ్గించి కట్టడడం వల్ల ఈ వరవ కాలువలో ప్రవహించిన నీరంతా వృథాగా సోమశిల-స్వర్ణముఖి కాలువలోకి చేరింది. దాంతో ఈ కాలువ మొత్తం వరదనీటితో నిండిపోయింది. పంట కాలువలు సన్నగా నిర్మించడం వల్ల ఇందులో నీరు ప్రవహించడం లేదు. టి.బి.పల్లి, దాచెరువు గ్రామాలకు చెందిన పొలాలు పరిధిలో ఎస్‌.ఎస్‌ కాలువపై అడ్డుగా కాలువపై ఎత్తుగా పంట కాలువ నిర్మించారు. దాంతో పంట కాలువలోకి నీరు వెళ్లక పొలాలు నీట మునిగిపోయాయి. కింద భాగంలో ఉన్న చెరువులకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. వెంకటగిరి ప్రాంతంలో చిన్న, పెద్ద చెరువులు దాదాపు 35 వరకు ఉన్నాయి. డక్కిలి మండలంలో దాదాపు 25 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో సగం వరకే నిండాయి. ఎస్‌ఎస్‌ కాలువ నుంచి నీరు చెరువులకు వెళ్లేందుకు సిద్దవరం, టి.బి.పల్లి వద్ద తూములు ఏర్పాటు చేశారు తప్పిస్తే అనుసంధానంగా కాలువ నిర్మాణం చేపట్టలేదు. దాంతో జలవనరులు శాఖ అధికారులు రూ. 20 లక్షలు వరకు వెచ్చించి ఈ ప్రాంతాలు వద్ద తూములకు అనుసంధానం కాలువ నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా మన్నవరం ప్రాంతంలో కూడా కాలువ తవ్వకాలు చేపట్టారు.

నీరులేదు.. పంట రాదు

వెంకటగిరి, డక్కిలి మండలాలు పరిధిలో సిద్దవరం, పారవోలు, బాలసముద్రం, వెంకటగిరి చెరువులకు నీరు సక్రమంగా అందలేదు. డక్కిలి మండలంలో తీర్థంపాడు, అల్తూరుపాడు, నాగవోలు, చెన్నసముద్రంతో సహా పలు చెరువులకు నీరు అందలేదు. దాంతో ఈ రెండు మండలాలు పరిధిలో దాదాపు 2500 ఎకరాల భూమిలో వ్యవసాయసాగు ప్రశ్నార్థకంగా మారింది.

వరినార్లు వేయవద్దు : బాబు, జలవనరుల శాఖ ఏఈ, వెంకటగిరి

ప్రస్తుతం కురిసిన వర్షాలకు సగం మేర చెరువులు నిండాయి. రైతులు ఇప్పుడు వరినార్లు వేస్తున్నారు. దీనివల్ల పంట చివరిదశలో నీరు అందివ్వలేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వేసిన నార్లును నాటుకోవడమే ఉత్తమం. గొడ్డేరు వాగు నుంచి వెంకటగిరి, చింతగుంట, పారవోలు, సిద్దవరం తదితర చెరువులకు నీరు వచ్చేలా కాలువ నిర్మాణం అవసరం దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లతాం.

నిండని సిద్దవరం చెరువు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.