close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు

కలెక్టర్‌ హరిత


మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

రూరల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అర్హత కలిగిన నిరుద్యోగులు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్‌ హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రమోషన్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ టీప్రైడ్‌ కార్యక్రమంలో భాగంగా 43 పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వచ్చాయని, ఎస్సీ-13, ఎస్టీ-30 యూనిట్ల వంతున దరఖాస్తులు రాగా వీటన్నింటికి 1.12 కోట్ల 80 వేల రూపాయల రాయితీతో అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఇందుకు జిల్లా పరిశ్రమల శాఖ నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. సమావేశంలో ఇండస్ట్రీస్‌ జీఎం నర్సింహమూర్తి, ఎల్‌డీఎం సత్యజిత్‌, ఎలక్ట్రిసిటీ ఏడీ రాజు, సీటీవో పుష్పలత, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జనార్దన్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

భూసమస్యలు వెంటనే పరిష్కరించండి..

జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వారానికి రెండు గ్రామాలను సందర్శించి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వారంలో 200 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు డిజిటల్‌ సంతకాలు చేసేలా చూడాలన్నారు. పురోగతిలో లేని మండల తహసీల్దార్లను కలెక్టర్‌ మందలించారు. భూసమస్యలు వేగవంతంగా పరిష్కరించేందుకు సర్వే అధికారులను, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఆర్‌డీవోలు పర్యవేక్షణ చేయాలన్నారు. పీవోటీలో ఉన్న భములను పరిశీలన చేసి వెంటనే పూర్తి చేయాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల పరిష్కారంలో ముందంజలో ఉన్న పర్వతగిరి తహసీల్దార్‌ మహబూబ్‌అలీని కలెక్టర్‌ అభినందించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న అన్ని ధ్రువీకరణ పత్రాలు త్వరితగతిన అందించేందుకు తహసీల్దార్లు చొరవ చూపాలన్నారు. జేసీ మహేందర్‌రెడ్డి, ఆర్‌డీవోలు రవి, కిషన్‌, మహేందర్‌జీ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.