close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

సీహెచ్‌సీల్లో అభివృద్ధి కమిటీలు

నర్సంపేటలో పూర్తి, త్వరలో పరకాల, వర్ధన్నపేటలో..

పరకాల, న్యూస్‌టుడే: ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రా(సీహెచ్‌సీ)ల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నర్సంపేట సీహెచ్‌సీ పరిధిలో కమిటీ ఎన్నిక పూర్తవగా త్వరలో పరకాల, వర్ధన్నపేట సీహెచ్‌సీల్లో కూడా ప్రక్రియ పూర్తి కానుంది.

ప్రతీ సీహెచ్‌సీకి నిర్వహణకు ఏటా రూ. 2.50 లక్షలు మంజూరవుతున్నాయి. వీటిని తాగునీరు, విద్యుత్తు, ఇతర అత్యవసర అవసరాలు, మరమ్మతుల కోసం వినియోగిస్తుంటారు. ఆసుపత్రుల్లో ఎలాంటి సమస్యలున్నాయి, ఎలా పరిష్కరించాలని, నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు సమావేశమై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా నిధులను కేటాయించి అవసరమైన పనులు చేయాలి. ఈ కమిటీకి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతీ మూడు నెలలకోసారి కమిటీ సమావేశమై అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి కమిటీలను ఎమ్మెల్యేలు గెలుపొందిన వెంటనే ఏర్పాటుచేయాలి. కొంత జాప్యమవ్వగా ఎట్టకేలకు ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. గత నెల 27న నర్సంపేట సీహెచ్‌సీ కమిటీని ఎన్నుకున్నారు. పరకాల, వర్ధన్నపేట సీహెచ్‌సీల్లో కూడా ప్రక్రియను ప్రారంభించారు.

కమిటీలో...

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. సభ్యులుగా పురపాలక సంఘం ఛైర్మన్‌, నియోజకవర్గంలోని ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, డీసీహెచ్‌వో, పురపాలక సంఘం కమిషనర్‌, ఆర్డీవో, సీనియర్‌ డాక్టర్‌, మెప్మా నుంచి ఒకరు, స్వచ్ఛంద సంస్థ తరపున లయన్స్‌ క్లబ్‌ లేక రోటరీ క్లబ్‌ నుంచి ఒకరు, ఆయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఉంటారు.


వారం రోజుల్లో కమిటీలు పూర్తి

- డాక్టర్‌ ఆకుల సంజీవయ్య, జిల్లా సీహెచ్‌సీల సూపరింటెండెంట్‌

సీహెచ్‌సీల అభివృద్ధి కమిటీల ప్రక్రియను ప్రారంభించాం. నర్సంపేటలో కమిటీ పూర్తవగా వారం రోజుల్లో పరకాల, వర్ధన్నపేటలో కూడా పూర్తి చేస్తాం.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.