close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

అంబరాన్నంటిన క్రీడా సంబురం

అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

ఉమ్మడి పది జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు


జ్యోతి వెలిగిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో 65వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరగనున్న ఈ క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 320 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడలకు లక్షెట్టిపేట వేదిక కావడం గర్వకారణం అన్నారు. అంతకుముందు పట్టణంలో క్రీడాకారులు మువ్వన్నెల పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రాంరెడ్డి, డీవైఎస్‌వో శ్రీకాంత్‌ రెడ్డి, క్రీడల కన్వీనర్‌ కె.రవీందర్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రోజీవరకుమారి, పాఠశాల హెచ్‌ఎం జి.యశోధర, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.రఘునాథ్‌రెడ్డి, నల్మాస్‌ కాంతయ్య, పోడేటి శ్రీనివాస్‌గౌడ్‌, పాదం శ్రీనివాస్‌, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.