close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

అభివృద్ధే లక్ష్యంగా భూముల అమ్మకానికి అనుమతులు

వేణుగోపాలస్వామి దేవస్థానం ఛైర్మన్‌

దేవస్థానం శిథిలావస్థకు చేరిన వైనాన్ని చూపిస్తున్న

ఛైర్మన్‌ మన్నెం లక్ష్మీనాథ్‌రెడ్డి

మూలాపేట(నెల్లూరు-సాంస్కృతికం), న్యూస్‌టుడే : నగరంలో మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా భూములను అమ్మాలని దేవదాయశాఖను అనుమతులు కోరామని ఆ దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ మన్నెం లక్ష్మీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. దేవస్థానంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి భూముల విక్రయాలను అనుమతులను కోరడంపై వివరణ ఇచ్చారు. గతంలో విక్రయించిన భూముల తాలూకా నగదు బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉన్నాయన్నారు. వాటిపైన వస్తున్న వడ్డీ భారీగా తగ్గిపోవడంతో దేవస్థానం ఆదాయం తగ్గిందని, ఖర్చులు భారీగా పెరగడంతో అప్పుల్లోకి వెళ్లామన్నారు. పురాతన దేవస్థానం కావడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. దేవస్థానం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పర్యవేక్షణకు ఈవోను నియమించాలని కోరామన్నారు. వ్యవస్థాపక ధర్మకర్తగా కొనసాగిన ఆనం వివేకానందరెడ్డి తదనంతరం ఆయన కుటుంబ సభ్యుల కోరితే వారికి ధర్మకర్తగా అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, దేవదాయ శాఖ ఏసీ వేగూరు రవీంద్రారెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త మజ్జిగ చంద్రమౌళిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.