శుక్రవారం, డిసెంబర్ 06, 2019
ప్రశంసాపత్రాలతో ఉపాధ్యాయులు
దేవరుప్పుల, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయులను హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో పాఠశాల విద్య కమిషనర్ విజయకుమార్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. వీరు సమగ్ర శిక్ష అభియాన్ యూనిసెఫ్ సహకారంతో ఆరు నుంచి పది తరగతుల గణితం, భౌతిక, జీవ, సాంఘికశాస్త్రాల పాఠ్యాంశాలను దృశ్యీకరించి, సులువుగా విద్యార్థులు ఆకళింపు చేసుకునేందుకు కృషి చేశారు. ఎస్.విజయకుమార్ (గట్ల నర్సింగాపురం), నిమ్మ వాసుదేవరెడ్డ్డి (జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చీటూరు), ఏ.సతీష్ ప్రకాశ్ (జిపసె పాఠశాల, దుగ్గొండి), అశోక్‌కుమార్ (జిపసె పాఠశాల, శనిగరం), కె.సుధాకరాచారి (ప్రాథమిక పాఠశాల, మైలారం)లను కమిషనర్ విజయకుమార్ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. మరో ఉపాధ్యాయురాలు ముక్తవరం ఝాన్సీరాణి (జిపసె పాఠశాల, కొడవటూరు) మరో శిక్షణ కార్యక్రమంలో ఉండడంతో అందుకోలేకపోయారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు