close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

బాలికపై యువకుడి అత్యాచారయత్నం

ఆలస్యంగా వెలుగులోకి

నర్సింహులపేట, న్యూస్‌టుడే: బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రియాజ్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న మండలంలోని ఓ తండాకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆడుకుంటుండగా అదే తండాకు చెందిన యువకుడు గుగులోతు అనిల్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు. బాలిక రెండు రోజులుగా ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.