close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

మరోఅడుగు

మేడారానికి యునెస్కో గుర్తింపు ప్రయత్నాలు..

జాతర విశేషాలతో దరఖాస్తు చేసేందుకు సన్నాహాలు

ప్రజాప్రతినిధులు, అధికారుల యోచన

సాధ్యాసాధ్యాలపై నిపుణుల సలహాలు

పూర్తి సమాచార సేకరణలో అధికారులు..

ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం రామప్ప అడుగు దూరంలో ఉంది. దేశం నుంచి ఒకే ఒక నామినేషన్‌తో పోటీ పడుతోంది రామప్ఫ భారత్‌లో అత్యంత విశేషంగా జరిగే మేడారం మహాజాతరనూ గుర్తింపునకు దరఖాస్తు చేసే ఆలోచన చేస్తున్నారు. ఇటీవల జాతర ఏర్పాట్ల సందర్భంగా జరిగిన సమావేశంలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత ఈ అంశాన్ని ప్రస్తావించారు. తామూ అదే యోచన చేస్తున్నట్లు జిల్లా అధికారులు చెప్పారు.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

రామప్పను ప్రాచీన కట్టడాల విభాగంలో నామినేట్‌ చేశారు. మేడారాన్ని సాంసృృతిక విభాగంలో దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే ఇక్కడి పూజాధికాలు నిర్వహిస్తారు.

ఎన్నో విశేషాలు.. ప్రత్యేకతలు..

మేడారం మహాజారత ఎన్నో వింతలు, విశేషాలు, ప్రత్యేకతలకు నెలవు. కోటి మందికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుంటారు. రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి తరలివస్తారు. ఆలయాలు, గోపురాలు హంగు ఆర్భాటాలు లేకుండా వనంలో, వెన్నెల వెలుగుల్లో అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది. దేవతా మూర్తులు , విగ్రహాలు ఉండవు. అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన బెల్లం(బంగారం) నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.

సమాచార సేకరణ..

జాతర విశిష్టత, ప్రత్యేకతలకు సంబంధించిన సమగ్ర వివరాలు అధికారులు సేకరించనున్నారు. వీటితో డోజియర్‌ను తయారు చేయనున్నారు. గత జాతర సమయంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని రికార్డు చేశారు. ఆరంభం నుంచి పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయో అన్నీ పొందుపరిచారు. డాక్యుమెంటరీని రూపొందించారు. ఇంకా అవసరమైన వివరాలను జతచేయనున్నారు.

వివరించాలి.. మెప్పించాలి

యునెస్కోకు నామినేట్‌ కావాలంటే ప్రతిపాదనల వివరాలను సమగ్ర నివేదికలను తయారు చేయాలి. సంబంధిత నిర్మాణం లేదా ప్రక్రియలో మిగతా 2లో... తప్పనిసరిగా ప్రత్యేకతలు ఉండాలి. ఎక్కడా లేని విధంగా ఉండాలి. యునెస్కో నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులు వచ్చేందుకు రవాణా సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో వసతులు సమకూర్చాలి. వీటన్నింటితో డోజియర్‌ను రూపొందించి కేంద్ర పురావస్తు శాఖకు(ఏఎస్‌ఐ) పంపించాలి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను చూసి ప్రాధాన్యాన్ని అనుసరించి ఆమోదిస్తుంది. మొదట దేశం నుంచి నామినేట్‌ అయినదాన్ని పరిశీలనలోకి తీసుకొని యునెస్కో బృందం పర్యటిస్తుంది. సమర్పించిన నివేదికలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవా అని చూసి తుది నివేదికలు సమర్పిస్తుంది. అనంతరం అంతర్జాతీయ వేదికలో వివిధ దేశాల ప్రతినిధులతో మనదేశం నుంచి వెళ్లిన బృందంతో చర్చిస్తుంది. తర్వాత అన్ని రకాలుగా సరైందని అనిపిస్తే గుర్తింపును ప్రకటిస్తుంది.

సమాచారాన్ని సేకరిస్తున్నాం

- నారాయణరెడ్డి, ములుగు కలెక్టర్‌

యునెస్కో గుర్తింపు కోసం సమాచారాన్ని సేకరిస్తాం. నిపుణుల సలహాలు, సూచనలతో పూర్తి వివరాలతో డోజియర్‌ను రూపొందించి కేంద్ర పురావస్తు శాఖకు పంపిస్తాం. అక్కడ పరిశీలించి ఆమోదం తెలిపి యునెస్కోకు నామినేట్‌ చేస్తుంది. వచ్చే ఏడాదికి నామినేషన్లలో మహాజాతరను చేర్చేవిధంగా కృషి చేస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.