close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

కారాదు.. గతం పునరావృతం

సౌకర్యాలు కల్పిస్తేనే సమస్య తీరేది

ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు

- న్యూస్‌టుడే, తొర్రూరు టౌన్‌

తొర్రూరు మండలంలో కల్లాల వద్ద నిర్వహిస్తున్న కాంటాలు

కొనుగోలు కేంద్రాల సంఖ్య,  ఉత్పత్తి అంచనా (లక్షల మెట్రిక్‌ టన్నులలో)

మహబూబాబాద్‌  85  1.31

జయశంకర్‌  105  1.25

ములుగు  120  1.70

జనగామ  67  60

వరంగల్‌ అర్బన్‌  59  90

వరంగల్‌ రూరల్‌  103  1.36 ●

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే వరకూ ఎన్నో ఇబ్బందులు.. చివరికి వచ్చిన దిగుబడిని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే అక్కడా అవస్థలే. రోజుల తరబడి నిరీక్షణే.. చేసేదిలేక పలువురు కల్లాల్లోనే తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఏటా కర్షకులు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఈసారీ హలధారులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి సిద్ధం అయ్యారు. ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతం పునరావృతం కాకుండా చూస్తేన్నే అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది.. లేదంటే మళ్లీ కన్నీళ్లు పెట్టాల్సిందే.

అంచనాకు మించి సాగు....

వర్షాలు సమృద్ధిగా కురవడం, ఎస్సారెస్పీ కాలువల ద్వారా జలాలు మిగతా 2లో... విడుదల కావడంతో ఈ ఖరీఫ్‌లో అంచనాకు మించి వరిసాగు పెరిగింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరిసాగు విస్తీర్ణం 1.55 లక్షల హెక్టార్లు కాగా 1.68 లక్షల హెక్టార్లు సాగైంది. సాధారణం కంటే సుమారు 9 శాతం అధికంగా సాగైంది. పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం 8.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడిలో సుమారు 80 శాతం కొనుగోలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

పెరిగిన మద్దతు ధర..: గత ఏడాదితో పోల్చుకుంటే ధాన్యం మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. నిరుడు సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ. 1750 చెల్లిస్తే ఈ సంవత్సరం రూ.1815, ఏ గ్రేడ్‌ రకానికి గతేడాది రూ. 1770 ఇస్తే ఈసారి రూ.1835 చెల్లించాలని నిర్ణయించింది.

మౌలిక వసతులు మరవొద్ధు.: కొనుగోలు కేంద్రాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో గతంలో ధాన్యం తడిసిపోయి మొలకెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. గన్నీ సంచులు, గోదాములు, టార్పాలిన్లు, సరైన రవాణా సౌకర్యం, కాంటాలు తదితర సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 43 లక్షల గన్నీ సంచులను సిద్ధం చేశామని, అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అ జిల్లాలోని రైస్‌ మిల్లులకు రవాణా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పడికే ఉమ్మడి జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అదనపు కొనుగోళ్ల కేంద్రాలకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.

కొనుగోలు సకల సౌకర్యాలకు చర్యలు

- మహేందర్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, మహబూబాబాద్‌

కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. గన్నీ సంచులు, టార్పాలిన్లను తగినన్ని సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం సరైన మద్దతు ధరను కల్పించినందున రైతులు దళారులను ఆశ్రయించొద్ధు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.