close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ముఖ్యమంత్రికి నాయకుల కృతజ్ఞతలు

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఏనుగు రమణారెడ్డి, చేజర్ల సుధాకర్‌రావుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశం జరిగింది. ఈసందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీకింద ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం జీవో నంబరు 628ని విడుదల చేయడం అభినందనీయం అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు మునిరెడ్డి, గూడూరు తాలూకా అధ్యక్షులు ఏవీ సురేష్‌, ఏపీఎన్జీవో మాజీ కార్యదర్శి ఖాదర్‌బాషా, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.