close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

రాతి ఇసుక యూనిట్లకు రుణం

పావలా వడ్డికే అందజేత

యువకులకు ప్రోత్సాహం

 యంత్రాల ద్వారా ఇసుక తయారీ

రోబో శాండ్‌ (రాతి ఇసుక) యూనిట్లు ఏర్పాటుచేసే యువతకు తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇసుక కొరత అధిగమించే కార్యక్రమాల్లో భాగంగా రాతి ఇసుక వాడుక పెంచాలని సూచనలు చేశారు. రాతి ఇసుక వాడకంలో ఎలాంటి లోపం ఉండదని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇసుక లేని చోట్ల కంకర డస్ట్‌ కాంక్రీట్‌ వాడుతున్నట్లు చెబుతున్నారు. రెండేళ్ల కిందట ఇలాంటి పరిస్థితులు వస్తే పట్టణాల్లో అనేక చోట్ల రాతి ఇసుక వాడకంతో సిమెంటు రహదారుల వేసినట్లు గుర్తుచేస్తున్నారు. ఇసుకకు బదులు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే రాతి ఇసుక మేలు చేస్తోందని, పర్యావరణానికి జరిగే హాని తగ్గించవచ్చని చెబుతున్నారు.

న్యూస్‌టుడే, పెళ్లకూరు: జిల్లాల్లో సుమారు 32 మండలాల్లో రోడ్‌ మెటల్‌ అందుబాటులో ఉంది. ఆయా ప్రాంతాల్లో రాతి ఇసుక యూనిట్లు ఏర్పాటుచేయడానికి అనువుగా ఉంటుంది. ఇందుకు యువత ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)ని సంప్రదించాల్సి ఉంది. దీని ద్వారా ఏర్పాటుచేసే సంస్థలకు ఎంఎస్‌ఎంఈ, చిన్న పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తోంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీతోపాటు బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్ఛు ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేసే వారికి భూమి, గనుల లీజులో రాయితీలు ఇచ్చే అవకాశముంది. అటు ప్రభుత్వానికి ఆదాయంతోపాటు యువత పారిశ్రామికంగా ఎదగడానికి మంచి అవకాశంగా చెబుతున్నారు. ఇసుక కొరత తీర్చడం ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం.

●*రోడ్‌ మెటల్‌ ద్వారా ఏటా రూ. కోట్లలో ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. 2015-16 ఏడాది 19,10,887 మెట్రిక్‌ టన్నుల రోడ్‌ మెటల్‌ తవ్వకాల ద్వారా దాదాపుగా రూ. 28.66 కోట్ల మేర ఆదాయం సమకూరింది. 2016-17లో 3,69,660 టన్నుల తవ్వకాలకు రూ. 2.77 కోట్లు ఆదాయం వచ్చింది. 2017-18లో 5,48,412 టన్నుల తవ్వకాలకు రూ. 4.18 కోట్ల మేర రాబడి వచ్చింది. రోడ్‌ మెటల్‌ వాడకం తగ్గడంతో ఆదాయం తగ్గింది. దీంతో ఇసుక యూనిట్లు ఏర్పాటుచేయడం ద్వారా ఏపీఎండీసీకి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశముంది. వేల మందికి ఉపాధి దొరుకుతోంది.

గతంలో ఉచితం నేడు డిమాండ్‌: రాతి ఇసుక క్వారీల్లో గతంలో ఉచితంగా తీసుకెళ్లే పరిస్థితి కాగా ప్రస్తుతం అందుబాటులో ఉండడంలేదు. దీంతో దీని ధర నిర్ణయించడంతో డిమాండ్‌ పెరిగింది. దీని వాడకం దాదాపు 2 నుంచి 5 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

●*నిర్మాణ రంగంతో పాటు మౌలిక వసతుల రంగంలో మున్ముందు ఇసుక కొరత వేధించే అవకాశముంది. యువత కూడా ఈ దృష్టితో ఆలోచన చేస్తే మంచి ఆదాయం కూడా సమకూరే అవకాశముంది. తక్కువ వడ్డీకే రుణం అందుబాటులో ఉండం మరో అవకాశం. జిల్లాలోని మెట్టప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయవచ్ఛు ఇందుకు రోడ్‌ మెటల్‌ ఉన్న ప్రాంతాలు ఎంపిక చేసుకుని అక్కడ లీజుకు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడే యూనిట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. కంకరను పొడిగా మార్చే యూనిట్లు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. వీటికి కనీసం రూ. 5 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పెట్టుబడిగా కొంత సొంతంగా పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్ము బ్యాంకుల నుంచి రుణం ప్రభుత్వం ఇప్పిస్తోంది.

●*మూతపడిన యూనిట్లు తిరిగి ప్రారంభించి వాటిని రాతి ఇసుక యూనిట్లుగా మార్పిడి చేయాల్సి ఉంది. రోడ్‌ మెటల్‌ కోసం కొన్ని చోట్ల క్రషర్లు ఏర్పాటు చేసి ఆపేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని పునరుద్ధరించినట్లు అవుతుంది. ఇలాంటి యూనిట్లు మీద దృష్టి పెట్టడంతోపాటు కొత్త యూనిట్లు ప్రోత్సహించాల్సి ఉంది. ముందుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అలవాటు చేయాల్సి ఉంది. కచ్చితంగా వాడాలన్న నిబంధన తీసుకురావడం ద్వారా ఇసుక అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడే అవకాశముంది. అందుబాటులో ఉండేవాటిని వదలి లేని వనరుల మీద ఆధారపడడంతో డిమాండ్‌ పెరుగుతోంది.

●*క్రషర్ల ద్వారా తయారు చేసే ఇసుక (రోబోశాండ్‌) ప్రస్తుతం యూనిట్‌ ధర రూ.1,500 వరకు ఉంటోంది. అందుబాటులో ఉన్నా చాలా మంది వాడకానికి ఇష్టపడడంలేదు. ముందుగా ప్రభుత్వ పథకాల్లో దీనిని వాడే పరిస్థితులు తీసుకురావాల్సి ఉంది. అధికారులు, గుత్తేదారులు అందుబాటులో ఉండే ఇసుక వాడేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది నిర్మాణదారులు ఇసుకపైనే ఆధారపడుతున్నారు. పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో ఏకంగా ఓ కార్పొరేట్‌ ఆసుపత్రినే రోబో శాండ్‌తో నిర్మించారంటే అతిశయోక్తి కాదు. దీని సామర్థ్యాన్ని ఇంజినీరింగ్‌ నిపుణులు మదించారు. దీన్ని ఏర్పాటుచేసి మూడేళ్లయినా ఎలాంటి తేడా లేదు. అదే విధంగా తాజా పరిస్థితుల్లో నాయుడుపేటలో ఓ మాజీ ఎంపీ తన భవన నిర్మాణాలకు రాతి ఇసుక వాడుతున్నారు.

 

ఇలాంటిదే రాతి ఇసుక

 

 

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.