ఆదివారం, డిసెంబర్ 08, 2019
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే : జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలసి అమరావతి నుంచి సోమవారం మధ్యాహ్నం జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాల వారీగా రైతు భరోసా పథకం అమలు తీరుపై చర్చించారు. ఈ నెల 15వ తేదీలోపు అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లాలో రైతు భరోసా, ప్రత్యేక స్పందన కార్యక్రమం జరిగిన తీరు, ఇతర వివరాలను కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి హాజరైన జేసీ వినోద్‌కుమార్ మంత్రులకు వివరించారు. నిర్ధేశించిన గడువులోపు అన్ని సమస్యలు పరిష్కరించి, అర్హులైన రైతు ఖాతాల్లోకి నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు