close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

మహాత్మాగాంధీకి యూనియన్‌ బ్యాంకు నివాళి

గాంధీ విగ్రహం వద్ద యూనియన్‌ బ్యాంకు అధికారులు

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: మహాత్మాగాంధీకి యూనియన్‌ బ్యాంకు సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు. బ్యాంకు శతవసంత వేడుకలను పురస్కరించుకుని ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత బ్యాంకును 1919 నవంబర్‌ 11న మహాత్మాగాంధీ ప్రారంభించినందున ఆయనకు నివాళి అర్పించామని బ్యాంకు రీజనల్‌ హెడ్‌ ఆర్‌.రెడ్డెప్ప తెలిపారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. రీజనల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ ఖాతాదారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బ్యాంకు సేవలను ఖాతాదారులకు చేరువచేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌ కార్యాలయం చీఫ్‌ మేనేజర్‌ సంతోష్‌, మనోజ్‌, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.