close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నేరాలపై టాస్క్‌ఫోర్సు శోధన.. ఛేదన

నెల్లూరు (వీఆర్సీ సెంటరు) న్యూస్‌టుడే

విషయం: పోలీసు శాఖలో ఏర్పాటైన ‘టాస్క్‌ఫోర్స్‌’ 

ఏర్పాటైంది : ఆగస్టు 28, 2019
ఎంత మంది : ఆరుగురు
నిందితుల కోసం తిరిగిన రాష్ట్రాలు : తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌
అరెస్టు చేసిన నిందితులు 41 
ఛేదించిన కేసులు  8
ఎవరెవరు : సీఐ, ఎస్సై, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు


జిల్లాలో ‘టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటైన నెలల వ్యవధిలోనే భారీ కేసులను పరిష్కరించగలిగారు. నేరాలు జరుగుతున్న తీరుతెన్నులు, దీని వెనక ఉన్న మూలాలను గుర్తించడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పటి వరకు ఎనిమిది కేసులను పరిష్కరించగా అందులో కొన్ని కేసులు జాతీయస్థాయిలో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న నేరస్థులు కావడం గమనార్హం. 


స్మార్ట్‌ ఫోన్ల లోడుతో ఉన్న ఓ కంటైనరును గుర్తు తెలియని ఐదుగురు దుండగులు హైజాక్‌ చేశారు. దగదర్తి ప్రాంతం వద్ద లారీనే దొంగిలించారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరకు విలువ దాదాపు రూ.2.77 కోట్లు. కేసును పరిష్కరించడంలో టాస్క్‌ఫోర్స్‌ ముఖ్యపాత్ర పోషించింది.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించŸగలిగారు. టవర్‌ డంప్, సీసీ కెమెరాలు, వేలి ముద్రలు తదితరాల సాయంతో నిందితులను పట్టుకోగలిగారు. సాంకేతికతతోనే వారు ఎక్కడున్నది తెలుసుకోగలిగారు. కదలికలపై నిఘా ఉంచి తదుపరి చర్యలు తీసుకునేలోపే అదుపులోకి తీసుకునేవారు. నిందితులు ఎక్కడ నుంచి వెళ్తున్నారు? 

 

కేవలం మన రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు దోచుకునే ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. హరియాణాకు చెందిన ముగ్గురు విలాసవంతమైన జీవితం కోసం స్కిమ్మింగ్‌ యంత్రాలతో ఏటీఎంలలో దోపిడీకి పాల్పడేవారు. నగదు కోసం వచ్చే వారి ద్వారా పిన్‌ నంబర్లు తెలుసుకుని అధునాతన సాంకేతికత ద్వారా కార్డును స్వైపింగ్‌ చేసుకుంటారు. అనంతరం అదే నంబరుతో నకిలీ కార్డు ద్వారా నగదును డ్రా చేసుకుంటారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిందితులను అనంతపురంలో పట్టుకున్నారు.అప్పటి వరకు వీరిని ఏ రాష్ట్ర పోలీసులూ అరెస్టు చేయకపోవడం గమనార్హం.

 

తొమ్మిది మందితో కూడిన ముఠా దొంగనోట్లను చలామణి చేస్తోంది. రూ.9 లక్షల వరకు మార్కెట్‌లో బదలాయింపు చేసింది. మరో రూ.40 లక్షల నకిలీ నోట్లు చేతులు మార్చేందుకు యత్నిస్తున్న తరుణంలో పట్టుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వీరు నిందితులుగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు వీరిని ఆదోని, చీరాల, ఏలూరులో  పట్టుకున్నారు.


ఎవరిని కలుస్తున్నారు? తర్వాత పరిణామం ఏమిటీ? వంటి వివరాలను ముందుగానే గమనించేవారు. ముఖ్యంగా టోల్‌ప్లాజా వద్ద ఉండే సీసీ కెమెరాలు కేసుల పరిష్కారానికి ఎంతగానో దోహదపడ్డాయి. నిత్యం వాటిని పరిశీలిస్తూనే నేరస్థులు ఎవరనేది గుర్తించగలిగారు. కంజరభట్స్‌ కేసులో టోల్‌ప్లాజా వద్ద ఉండే సీసీ కెమెరాలే వారధిగా నిలిచాయి. సీసీ ఫుటేజీ ఆధారంతోనే పోలీసులు కేసును పరిష్కరించగలిగారు. సీసీఎస్‌ పోలీసులు కేసును చూస్తుండగా వారికి తోడుగా టాస్క్‌ఫోర్సు బృందం తోడైంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు తిరిగింది. వీరంతా అతి దారుణమైన నిందితులు.వీరికి మరో పేరు కంజర్‌భట్స్‌. దేశ వ్యాప్తంగా వీరు దోపిడీలకు పాల్పడ్డారు. ఎంతో మందిని హతమార్చారు. వీరిని నెల్లూరు.. పోలీసులు మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. 


వెబ్‌సైట్‌లో డ్రగ్స్‌ బుక్‌ చేస్తే చాలు వాటిని సరఫరా చేస్తారు. నెల్లూరుకు చెందిన ఓ విద్యార్థి ద్వారా సేకరించిన సమాచారంతో కూపీ లాగారు. అతి భయంకరమైన సింథటిక్‌ డ్రగ్స్‌ ముఠాను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్‌ చేయని నైజీరియాకు చెందిన శామ్యూల్‌ ఉచెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై, బెంగళూరుకు చెందిన విద్యార్థులను సైతం అరెస్టు చేశారు.


గంజాయికి అలవాటు పడిన కొందరు బీటెక్‌ విద్యార్థులు విక్రయదారులుగా మారారు. అరకు నుంచి అతి తక్కువ ధరకు తెచ్చి బహిరంగ మార్కెట్‌లో అధిక రేట్లతో విక్రయించేవారు. తమిళనాడులోని ఓ కళాశాల కేంద్రంగా సాగుతున్న ఈ గుట్టుచప్పుడు కాని వ్యవహారాన్ని పోలీసులు కొలిక్కి తెచ్చారు. ఆరుగురు  విద్యార్థులను కావలిలో అరెస్టు చేశారు.


తాజాగా షార్ట్‌ ఫిల్మ్స్‌ పేరుతో చీకటి కార్యకలాపాల నిర్వహణ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమా అవకాశాల పేరుతో యువతులను లోబర్చుకుని వారి దృశ్యాలతోనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ చీకటి ప్రపంచంలోకి లాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాదు బాధితులే నిర్వాహకులుగా మారి చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఆరు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏక కాలంలో దాడులు చేసి ఎనిమిది మంది నిర్వాహకులు, ఐదుగురు విటులను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.