close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

సోదరభావంతో శాంతియుత వాతావరణం

ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌

ఎస్పీని పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానిస్తున్న ముస్లిం మత పెద్దలు

ఆదిలాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి మెలిసి ఉంటూ... శాంతియుత వాతావరణం నెలకొల్పడం అభినందనీయమని ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ అన్నారు. అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో జిల్లా ప్రజలు సంయమనంతో వ్యవహరించారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం అహేల్‌ -ఏ-సునేతుల్‌ జమాయిత్‌, మిలాద్‌ కమిటీ సభ్యులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. మిలాద్‌ ఉల్‌ నబి వేడుకలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి సహకరించిన పోలీసు యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ముందుగా మిలాద్‌ ఉల్‌ నబి సందర్భంగా జరిపే ర్యాలీలకు అనుమతులు నిరాకరించారు. ఈ సమయంలో జిల్లా ముస్లిం మత పెద్దలు ఎస్పీని కలిసి ర్యాలీలకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. అత్యంత క్లిష్టమైన సమయంలో ర్యాలీకి అనుమతులు సాధ్యం కానప్పటికీ... జిల్లా ముస్లిం సోదరులపై ఉన్న భరోసాతోనే అనుమతి ఇస్తున్నట్లు ఎస్పీ వారికి తెలిపారు. ఆదివారం జరిగిన ర్యాలీలు పోలీసులు నిర్దేశించిన సమయంలో ప్రశాంతంగా ముగియడంతో ముస్లిం మతపెద్దలు ఎస్పీని అభినందించి, సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ సురేష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌ ఉల్‌ హక్‌, ఏఎస్సై యూనుస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓర్పుతో సమస్యలు ఆలకించాలి

పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓర్పుతో ఆలకించి, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ సూచించారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను విని సంబంధిత పోలీసుస్టేషన్ల అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు చట్టపరమైన సహాయం అందించాలని సూచించారు. బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.