close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

విస్తరించనున్న హరితవనం..

ఇనుప కంచె ఏర్పాటుకు శంకుస్థాపన

నేడు జిల్లాకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాక


మావలలోని హరితవనం పార్కు

మావల, న్యూస్‌టుడే: మావలలోని హరితవనం మరింత విస్తరించనుంది. ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో ఉన్న పార్కును నాలుగువేల ఎకరాలకు విస్తరించేందుకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారు. రూ.2 కోట్ల కంపా నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా వాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్న హరితవనాన్ని విస్తరించేందుకు అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పట్టణ సరిహద్దున ఉన్న కేఆర్కే కాలనీ, దుర్గానగర్‌లో వేలాది ఎకరాలు అటవీ భూములున్నాయి. వీటి పరిధిలో అరుదైన వృక్ష జాతులను పెంచేందుకు, అటవీ జంతువులకు ఆవాసంగా మార్చేందుకు ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు. పట్టణీకరణ నేపథ్యంలో అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంలో భాగంగా చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయనున్నారు. కంచెను ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాల మొక్కలను పెంచి సంరక్షిస్తారు. గడ్డి జాతి మైదానాలను పెంచుతారు. పర్యాటకుల కోసం నడకదారులను ఏర్పాటు చేస్తారు. అటవీ అందాలను తిలకించేందుకు వాచ్‌టవర్లను నిర్మిస్తారు. హరితవనంలో జింకలు, కుందేళ్లు, మనుబోతులు, కోతులు నెమళ్లు, ఇతర పక్షి జాతుల సంతతి పెరిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తారు. వాటి దప్పిక తీర్చేందుకు నీటి వసతులు సమకూరుస్తారు. అటవీ సంపద, అరుదైన వృక్షజాతులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచేందుకు అనువుగా పార్కును తీర్చిదిద్దుతారు. విస్తరణ పనులతో హరితవనం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. పనులకు భూమిపూజ చేసేందుకు మంత్రితో పాటు ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్‌ రాఠోడ్‌, సీఎఫ్‌ వినోద్‌ కుమార్‌, డీఎఫ్‌ఓ ప్రభాకర్‌ రానున్నట్లు మావల ఫారెస్టు రేంజ్‌ అధికారి అప్పయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.