close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి


బంతిపూలతో ర్యాలీగా వస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు

శాంతినగర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస రీజియన్‌ కన్వీనర్‌ బి.దేవిదాస్‌ చారి అన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభించి 16వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, మహిళా కండక్టర్లు బంతిపూలను చేతిలో పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ డిపో ముందు నుంచి ఎన్టీఆర్‌, కుమురంభీం కూడలి, పాలనా ప్రాంగణం రహదారి మీదుగా సాగింది. ప్రయాణ ప్రాంగణం మీదుగా వెళ్లకూడదని పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అడ్డుకోవడమేంటని కార్మికులు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు డిపో ముందు కాసేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అనుమతించడంతో ర్యాలీ ప్రాంగణం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ర్యాలీలో ప్రయాణికులు, దుకాణాలు, దారి వెంట కలిసిన వారికి పూలను అందిస్తూ ఆర్టీసీ బంద్‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల ఐకాస నాయకులు ఎల్‌.రమేష్‌, ఎం.ఆర్‌.రెడ్డి, ఎం.బి.రావు, డిపో కో-కన్వీనర్లు ఇ.వి.ఆర్‌.కిషన్‌, జాధవ్‌ భీంరావు, ఆశన్న, సూపర్‌వైజర్ల సంఘం రీజినల్‌ కన్వీనర్‌ కె.మోహన్‌, జె.ఆర్‌.మౌళి, సంఘాల నాయకులు కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆర్టీసీ కార్మికులు

జిల్లాలో 114 బస్సులతో సేవలు..

జిల్లాలో ఆదిలాబాద్‌, ఉట్నూరు బస్‌ డిపోలు ఉండగా ఆదివారం రోజు రెండు డిపోల పరిధిలో మొత్తం 114 బస్సులను నడిపించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ డిపో పరిధిలో 132 బస్సులకు గాను 89, ఉట్నూరు డిపో పరిధిలో 35 బస్సులు ఉండగా 25 బస్సులతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.