close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

సమస్య తీరింది.. రేషన్‌ ఇబ్బంది తొలగింది

మొత్తం: 396

కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలు 159

జిల్లాలోని పాత పంచాయతీలు 237

లక్ష్మణచాంద, న్యూస్‌టుడే:

అనుబంధ గ్రామంగా ఉన్న గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి గ్రామంలో నెలకొన్న సమస్యలను కొత్తగా ఎన్నికైన పాలకులు చొరవ చూపుతూ పరిష్కార మార్గం వైపు అడుగులేస్తున్నారు. ఇటువంటి గ్రామాల్లో ప్రధాన సమస్యల్లో ఒకటైన రేషన్‌ సరకుల కోసం గ్రామస్థులు ప్రతినెలా ఇతర గ్రామాలకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. గ్రామ పాలకులు, అధికారులు చొరవ చూపించటంతో లక్ష్మణచాంద, మామడ మండలాల్లో కొన్ని కొత్త పంచాయతీల్లో సమస్య దూరమవ్వడంతో గ్రామాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. రేషన్‌ ఇబ్బందులు తొలగించుకున్న గ్రామాలపై కథనం..

కొత్త దుకాణాల కోసం తహసీల్దార్లకు ఆదేశించాం

-కిరణ్‌కుమార్‌, డీఎస్‌వో

జిల్లాలోని కొత్త పంచాయతీలతో పాటు, రేషన్‌ ఇబ్బందులు ఎదుర్కుంటున్న గ్రామాలను గుర్తించి, అక్కడ కొత్త రేషన్‌ దుకాణాల ఏర్పాటు విషయమై తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటి వరకు 41 కొత్త రేషన్‌ దుకాణాలు అవసరమున్నట్లుగా ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి మంజూరు వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం.

లక్ష్మణచాంద నుంచి వీడి తిర్‌పెల్లి పంచాయతీగా

లక్ష్మణచాంద గ్రామానికి అనుబంధ గ్రామంగా ఉన్న తిర్‌పెల్లి కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఇక్కడి ప్రజలు దశబ్దాలుగా లక్ష్మణచాంద గ్రామానికి ప్రతినెలా వెళ్లి సరకులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. గ్రామ సర్పంచి కృష్ణారెడ్డి సమస్య పరిష్కారం కోసం మంత్రి, పాలనాధికారి, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లటంతో సదరు డీలర్‌కు గ్రామంలోనే సరకులు పంపిణీ చేయాలంటే ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డ ప్రజలకు అక్టోబరు మాసం రేషన్‌ సరకులను గ్రామంలో పంపిణీ చేయటంతో సంతోషించారు. ప్రతి నెలలో రెండు రోజుల పాటు సరకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయటంతో ప్రజల కష్టాలు తీరాయి.

అయిదు కిలోమీటర్లు నడిచేవారు..

మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి ఆరెపెల్లి అనుబంధ గ్రామం. ~రఈ గ్రామం నుంచి పరిమండల్‌ రావాలంటే అయిదు కిలోమీటర్లపైగానే ప్రయాణించాల్సి ఉంటుంది. పంచాయతీగా ఏర్పడటంతో ఇక్కడి ప్రజల రేషన్‌ ఇబ్బందులు తొలగించాలని గ్రామ సర్పంచి అరవింద్‌ జడ్పీఛైర్‌పర్సన్‌, పాలనాధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన వారు గ్రామంలో సరకులు పంపిణీ కోసం ఆదేశాలు జారీ చేశారు. సదరు డీలర్‌ గ్రామంలో రెండు రోజుల పాటు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. అక్టోబరు నెల నుంచి పంపిణీ ప్రారంభం కావటంతో గ్రామస్థులు సంతోషంగా ఉన్నారు.

అనుబంధ గ్రామానికి వరించిన అదృష్టం..

మల్లాపూర్‌ గ్రామానికి అనుబంధ గ్రామంగా మాచాపూర్‌ గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్‌ గ్రామానికి వెళ్లి ప్రతినెల రేషన్‌ సరకులు తెచ్చుకుంటారు. మల్లాపూర్‌ గ్రామం నుంచి ఎంపీపీగా ఎన్నికైన కేశం లక్ష్మి, ఆమె భర్త రమేష్‌ మాచాపూర్‌ వాసుల రేషన్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుబంధ గ్రామంలో రేషన్‌ ఇబ్బందులను తొలగించాలంటూ పాలనాధికారి, మంత్రికి సమస్యను వివరించారు. ఆర్డీవో ఆదేశాలతో గ్రామంలోనే సరకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో పంపిణీ ప్రారంభంలో రోజు పండుగ వాతావరణం కనిపించింది. ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారం కావటంతో గ్రామస్థులు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.