close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

స్వగ్రామంపై మమకారం..సేవతో ఉపకారం    

అభివృద్ధిలో ఆదర్శం పెద్దిరెడ్డిపల్లె


గ్రామంలో వృద్ధాశ్రమం

 

 

స్వగ్రామం..పేరువినగానే ఎంతటివారికైనా మనసులోతుల్లోంచి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. జీవిత ప్రయాణంలో నడకనేర్చిన పురిటిగడ్డపై ప్రతి ఒక్కరిలో ఎంతో మమకారం ఉంటుంది. ‘‘ అందరిలో నీవు తలెత్తుకునేలా భవిష్యత్తునిచ్చిన కన్నఊరి’ రుణం తీర్చుకోవడంలోనే నీ జన్మకు సార్థకత ఉంటుందని చెప్పిన మహనీయుల నుంచి ప్రేరణపొందిన ‘పెద్దిరెడ్డిపల్లె’ వాసులు స్వగ్రామంలో అభివృద్ధికి బాటలు వేశారు. జన్మభూమిరుణం తీర్చుకుంటున్నారు. పెద్దిరెడ్డిపల్లె(వరికుంటపాడు), న్యూస్‌టుడే

వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డిపల్లె గ్రామ జనాభా సుమారు 3వేలు. జిల్లా కేంద్రానికి ఎంతో దూరంలో ఉన్న ఈ పల్లెనుచూస్తే ముచ్చటేస్తుంది. బడి, గుడి, బాట, పెద్దలకు ఆశ్రయం ఇలా ప్రతి ఒక్కటీ ఉన్నాయి. పెద్దిరెడ్డిపల్లెకు చెందిన కొంతమంది వ్యాపారరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికి జన్మభూమిపై ఉన్న మకారంతో గ్రామస్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూరుస్తున్నారు.

గ్రామానికి చెందిన అమ్మా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పెండ్యాల సూర్యనారాయణ వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినా మనసంతా ఇక్కడే ఉంటుందంటారు. గ్రామంలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి పలువురు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. త్రిపురేశ్వరాలయాన్ని నిర్మించి ఏటా శివరాత్రి సమయంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముస్లింలకు దర్గాను నిర్మించారు. ఇదేవిధంగా వరికుంటపాడులో వృద్ధాశ్రమం, వేంకటేశ్వరస్వామి ఆలయం, కల్యాణమండపం నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు.

రావిళ్ల కుటుంబం : గ్రామానికి చెందిన రావిళ్ల నాగేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్థానిక జడ్పీ పాఠశాలలో వసతులు కల్పించేందుకు రూ.10 లక్షలు ఇచ్చారు. మరో రూ.10 లక్షలతో రావిళ్ల నాగేశ్వరరావు పేరిట కల్యాణ మండపం, పశువైద్యశాలను నిర్మించారు. ఏటా పాఠశాలలో పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందజేస్తున్నారు. బల్లి చెన్నక్రిష్ణయ్య దాతృత్వంతోపాటు గ్రామస్థుల సహకారంతో రూ. 20 లక్షలతో చెన్నకేశవస్వామి ఆలయం, కోడూరు శ్రీనివాసాచారి సహకారంతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నిర్మించారు. రావిళ్ల కుటుంబికులు రూ. 30 లక్షలతో నాగార్పమ్మ ఆలయం, పొనుగుపాటి పెద్దవెంకటసుబ్బయ్య దాతృత్వంతో శ్రీఅంకాళపరమేశ్వరి ఆలయ ముఖద్వారం నిర్మించడంతోపాటు రోడ్డు, బోరును ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా గ్రామస్థులంతా కలసి రూ. 60 లక్షలతో రామాలయం, రూ. 8 లక్షలతో అంకాళ పరమేశ్వరీ ఆలయాలు నిర్మించారు. ప్రభుత్వ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, ఉర్దూ పాఠశాల, వీధిదీపాలు, డ్రైనేజీ సౌకర్యాలను సమకూర్చుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచారు.

సూర్యనారాయణ



రావిళ్ల కుటుంబం నిర్మించిన కల్యాణ మండపం

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.