close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

విశాఖను కట్టడి చేసిన తూర్పుగోదావరి  


3 వికెట్లు తీసిన విజయ్‌ప్రసాద్‌

 

క్రాస్‌రోడ్డు (వెంకటగిరి), న్యూస్‌టుడే : వెంకటగిరిలోని నందమూరి తారక రామారావు క్రీడా మైదానంలో జరుగుతున్న అండర్‌-14 క్రికెట్‌ ఫైనల్స్‌లో విశాఖ జట్టును తూర్పుగోదావరి జట్టు బౌలింగ్‌తో కట్టడి చేసింది. రెండో రోజు ఆదివారం తొలి ఇన్సింగ్స్‌ బ్యాటింగ్‌ చేపట్టిన తూర్పుగోదావరి జట్టు ఆట ముగిసే సమయానికి 136.1 ఓవర్లకు 285 పరుగులు చేసి ఆలౌటయ్యారు. ఈ జట్టులో లొహిత్‌ 5 ఫోర్లు కొట్టి 35 పరుగులు చేశాడు. చరణ్‌ సాయి 6 ఫోర్లు కొట్టి 47 పరుగులు చేశాడు. విశాఖ జట్టు తరపున బౌలింగ్‌ చేసిన పరమవీర్‌ సింగ్‌, 50 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, రచిత్‌ 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. తరువాత బ్యాటింగ్‌ చేపట్టిన విశాఖ జట్టు 57.2 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేశారు. ఈ జట్టులో హర్షిత్‌ వర్మ 4 ఫోర్లు కొట్టి 31 పరుగులు, సాయి చరణ్‌ 3 ఫోర్లు కొట్టి 18 పరుగులు, యువన్‌ 3 ఫోర్లు కొట్టి 24, సాయి 4 ఫోర్లుకొట్టి 22 పరుగులు చేశారు. ఈ జట్టు మూడు పరుగులు చేయగానే వరుసగా రెండు వికెట్లను బౌలర్‌ విజయ్‌ ప్రసాద్‌ తీసి విశాఖ జట్టును దెబ్బ తీశాడు. తూర్పుగోదావరి జట్టు తరపున బౌలింగ్‌ చేసిన విజయ్‌ ప్రసాద్‌ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. లొహిత్‌ 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మూడో రోజు మ్యాచ్‌ యథావిధిగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

35 పరుగులు చేసిన లోహిత్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.