close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

అమ్మాయిలు.. ఆటలో ‘రాణి’స్తున్నారు

జాతీయ స్థాయిలో గుర్తింపు..

ప్రోత్సహిస్తే మరింత మెరుగు..

వాలీబాల్‌ క్రీడాకారిణుల మనోగతం

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే

అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆటలో ప్రావీణ్యం సాధిస్తూ.. ‘రాణి’స్తున్నారు క్రీడాకారిణులు. మెరుగైన సౌకర్యాలు, శిక్షకుల ఏర్పాటు, ప్రోత్సాహం, మైదానాల అభివృద్ధి వంటివి చేపడితే మరెంతో మందికి మేలు కలుగుతుందని పలువురు క్రీడాకారులు పేర్కొంటున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియం మైదానంలో 65వ అంతర్‌ జిల్లా అండర్‌ 17 బాలికల టోర్నీ, ఎంపిక పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పూర్వపు పది జిల్లాలకు చెందిన క్రీడాకారులు వాలీబాల్‌ క్రీడలపై చెబుతున్న వివరాలతో వారి మాటల్లోనే ‘న్యూస్‌టుడే’ కథనం.

మూడు సార్లు జాతీయ స్థాయిలో...

- ఎం.అఖిల, క్రీడాకారిణి, రంగారెడ్డి జిల్లా

నేను ఇప్పటి వరకు మూడు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో ఆడాను. చెన్నైలో అండర్‌ 14, ఒడిశాలో సబ్‌ జూనియర్‌, మధ్యప్రదేశ్‌లో మినీ నేష్నల్‌లో పాల్గొన్నాను. వాలీబాల్‌ క్రీడ అంటే చాలా ఇష్టం. శిక్షకులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ ఆటను మరింత మెరుగుపర్చుకుంటున్నాను. క్రీడాకారులను ఎంత ప్రోత్సహిస్తే అంతగా ఆట తీరు మెరుగుపడుతుంది.

ఇండోర్‌ స్టేడియంలు ఏర్పాటు చేయాలి..

- సి.హెచ్‌.లావణ్య, క్రీడాకారిణి, వరంగల్‌ జిల్లా

బెంగుళూరు, రాజస్థాన్‌, కలకత్తా, భువనేశ్వర్‌, మధ్యప్రదేశ్‌లో రెండుసార్లు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేను మంచి షూటర్‌ను. నా అట తీరును మెరుగుపర్చడంలో శిక్షకులే ముఖ్య కారణం. వారు చెప్పే విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్నాను. క్రీడాలు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇండోర్‌ స్టేడియంలు ఎంతో అవసరం. వాటిని ఏర్పాటు చేస్తే శిక్షణ చేసేందుకు ఎంతో వీలుంటుంది.

ప్రోత్సాహం ఎంతో ముఖ్యం..

- నిస్సి, క్రీడాకారిణి, హైదరాబాద్‌ జిల్లా

క్రీడాకారులకు ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. శిక్షకులు, మంచి మైదానాలు ఉంటే నైపుణ్యం కలిగిన క్రీడాకారులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రతి చోట వీటిని ఏర్పాటు చేయాలి. నేను ఒడిశా, మిజోరాంలలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. గెలుపుకోసం జట్టు సభ్యులందరం ఐక్యతతో ఆటను ఆడతాం. విజయాన్ని కైవసం చేసుకుంటాం.

శిబిరాలు ఏర్పాటు చేయాలి..

- వి.నిఖిత, క్రీడాకారిణి, నిజామాబాద్‌ జిల్లా

క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో మేలు కలుగుతుంది. తరచుగా నిర్వహించాలి. ఎటాక్‌, డిఫెన్స్‌ వంటివి ఆటలో ఎంతో కీలకం. గెలుపులో అందరి భాగస్వామ్యం ముఖ్యం. నేను ఇప్పటి వరకు కలకత్తా, మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రదర్శన కనబర్చాం.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలి..

- కె.పూజిత, క్రీడాకారిణి, మెదక్‌ జిల్లా

ఎంతో మంది మెరికల్లాంటి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. సరైన అవకాశాలు రాక వారు బయటకు రాలేకపోతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తే ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు చేయూతనివ్వాలి. నేను కర్ణాటకలో జరిగిన అండర్‌ 14 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను.

శిక్షణ చాలా అవసరం

- లావణ్య, క్రీడాకారిణి, ఆదిలాబాద్‌ జిల్లా

క్రీడాకారులకు శిక్షణ ఎంతో ముఖ్యం. వాలీబాల్‌ ఆటను మరింత మెరుగుపర్చుకోవాలంటే నిత్యం ప్రాక్టీస్‌ అవసరం. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకులను నియమించి శిక్షణనివ్వాలి. అలాగే మైదానాలు అభివృద్ధి చేస్తే ఎంతో మంది క్రీడాకారులకు మేలు కలుగుతుంది. మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, భువనేశ్వర్‌, ఒడిశాలలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో నేను ఆడాను.

మైదానాలు అభివృద్ధి చేయాలి..

- సారిక, క్రీడాకారిణి, ఖమ్మం జిల్లా

మైదానాలు అభివృద్ధి చేయాలి. ఎంతో మంది క్రీడాకారులు సౌకర్యాలు లేక బయటకు రాలేకపోతున్నారు. వారికి అవకాశాలిస్తే క్రీడల పరంగా అభివృద్ధి జరుగుతంది. మిజోరాం, బెంగుళూరు, కలకత్తా, భువనేశ్వర్‌లలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆడాను. జట్టు ఐక్యంతో మేము విజయాన్ని కైవసం చేసుకుంటున్నాం. శిక్షకులు ఇచ్చే మెలకువలు పాటిస్తూ ముందుకు సాగుతున్నాం.

క్రీడాకారులను ప్రోత్సహించాలి..

- అఖిల, క్రీడాకారిణి, కరీంనగర్‌ జిల్లా

క్రీడాకారులకు ప్రోత్సాహం చాలా అవసరం. ఇలాంటివి లేక ఎంతో మంది బయటకు రాలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి చేయూతనిస్తే మెరికల్లాంటి వారు బయటకు వస్తారు. ఇండోర్‌ స్టేడియంలు అందుబాటులోకి వస్తే నిత్యం శిక్షణ తీసుకునే అవకాశం ఏర్పడి ఆట తీరు మెరుగుపడుతుంది. మిజోరాంలో జరిగిన అండర్‌ 14 జాతీయ స్థాయి పోటీల్లో ఆడాను.

వాలీబాల్‌ అంటే ఎంతో ఇష్టం..

- కోటేశ్వరి, క్రీడాకారిణి, నల్గొండ జిల్లా

వాలీబాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకుంటూ, శిక్షకులు చేప్పే మెళుకువలు పాటిస్తూ ముందుకెళ్తున్నాను. ఎప్పటికైనా ఏదో ఒకటి సాధించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాను. కడప, కర్ణాటకలో జరిగిన అండర్‌ 14, షిర్డీలో జరిగిన మినీ నేషనల్స్‌లో ఆడాను.

శిక్షకులు ఎంతో ముఖ్యం..

- జ్యోతి, క్రీడాకారిణి, మహబూబ్‌నగర్‌ జిల్లా

ఏదైనా ఆటలో మెళుకువలు నేర్పేందుకు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు శిక్షకులు ఎంతో ముఖ్యం. మా కోచ్‌లు చేప్పే వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఆట తీరు మెరుగుపర్చుకునేందుకు శిబిరాలు ఎంతో దోహదం చేస్తాయి. తరుచూ వీటిని ఏర్పాటు చేయాలి. షిర్డీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ఆట తీరును ప్రదర్శించాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.