బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
eenadu telugu news
Updated : 30/07/2021 05:54 IST

బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు


ఛైల్ట్‌లైన్‌ అధికారులతో సమావేశమైన ఏఎస్పీ యోగేష్‌గౌతమ్‌

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్‌ ఏఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణలత లెనీనా గురువారం బాల రక్షా భవన్‌ను సందర్శించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏఎస్పీ యోగేష్‌ ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా మహబూబాబాద్‌ పట్టణంలో చేరదీసిన 11 మంది బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి పిలల్ల చదువులను కొనసాగించాలని సూచించారు. బాలలను దుకాణ యజమానులు రెండోసారి పనిలో పెట్టుకుంటే దుకాణం అనుమతి రద్దు చేయాలని కార్మిక శాఖ అధికారి రమేష్‌ను ఆదేశించారు. స్వర్ణలత లెనీనా మాట్లాడుతూ.. మా సంస్థలో బాల కార్మికులు లేరు అనే గోడ పత్రికను అన్ని ప్రదేశాల్లో అంటించాలని ఛైల్డ్‌లైన్‌ వారిని ఆదేశించారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే 1098 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు డేవిడ్‌, బాల రక్షా భవన్‌ కో-ఆర్డినేటర్‌ జ్యోతి, బాలల సంరక్షణ అధికారి నరేష్‌, ఎస్సై బాలకృష్ణ, వెంకటేశ్‌, రమేష్‌, అరుణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని