Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాస నేత అదృశ్యం?


రవీందర్‌

నయీంనగర్‌, న్యూస్‌టుడే: హన్మకొండ ప్రాంతం పోచమ్మకుంటకు చెందిన తెరాస సీనియర్‌ నేత రాచమల్ల రవీందర్‌ అదృశ్యమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 54వ డివిజన్‌ నుంచి తెరాస నుంచి రాచమల్ల రవీందర్‌ భార్య సునీత ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సూచన మేరకు ఆదివారం నామినేషన్‌ వేశారు. రెండు రోజులుగా తనకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు తమకు సీటు కేటాయించారని ప్రచారం చేస్తున్నారని రజిత తెలిపారు. తన భర్త ఉద్యమకాలం నాటి నుంచి నేటి వరకు పార్టీని నమ్ముకున్నా.. తమకు అన్యాయం చేశారని వాపోయారు. పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో తన భర్త మానసికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంధువులను, స్నేహితులను ఆరా తీసినా సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని వాపోయారు. తన భర్త ఆచూకీ కనుగొని తమకు న్యాయం చేయాలని పాలకులను, అధికారులను వేడుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని