నూకాలమ్మకు ‘ప్రసాద’మివ్వండి
eenadu telugu news
Published : 30/07/2021 05:52 IST

నూకాలమ్మకు ‘ప్రసాద’మివ్వండి

అనకాపల్లి ఎంపీ సత్యవతి వినతి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ సత్యవతి

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రసాద్‌ పథకం ద్వారా నిధులు ఇవ్వాలని అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ భీశెట్టి వెంకటసత్యవతి కోరారు. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని గురువారం కలసి వినతిపత్రం అందజేశారు. ప్రసాద్‌ పథకం ద్వారా నిధులు ఇస్తే ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు ఈ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని ఎంపీ వివరించారు. ఆలయ అభివృద్ధి కోసం తయారుచేసిన నిధుల ప్రతిపాదనను మంత్రికి అందజేశారు. పురావస్తు శాఖ అనుమతి లభించినందున బొజ్జన్నకొండను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టెండర్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ కోరారు.

* ఉన్నతస్థాయి అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, వాటి పురోగతి అంశాలపై ఎంపీ గురువారం పార్లమెంట్‌ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. దీనిపై సంబంధిత మంత్రి సర్బానంద మాట్లాడుతూ దేశంలో విశాఖపట్నం, ముంబయి తదితర ప్రాంతాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బదులిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని