Published : 11/06/2021 05:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శారదా ఎడమగట్టు పటిష్ఠతకు చర్యలు

నదిగట్టును పరిశీలిస్తున్న ఎంపీ సత్యవతి, అధికారులు

మునగపాక, న్యూస్‌టుడే: శారదానది ఎడమగట్టు పటిష్ఠానికి చర్యలు తీసుకొంటామని అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి అన్నారు. గణపర్తి వద్ద కోతకు గురైన శారదానది గట్టును గురువారం జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. గత ఏడాది కురిసిన వర్షాలకు 230 మీటర్ల మేర గట్టు పూర్తిగా దెబ్బతిందని గణపర్తి, చూచుకొండ, మెలిపాక, జోగారావుపేట సర్పంచులు చదరం గణేష్‌నాయుడు, దొడ్డి సూరి అప్పారావు, అయినంపూడి విజయ భాస్కరరావు, సన్యాసిరావు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సిమెంట్‌ కాంక్రీట్‌తో గట్టును పటిష్టం చేసేందుకు రూ. మూడు కోట్ల వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. దీనిపై అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని (సెజ్‌) ఏసియన్‌ పెయింట్స్‌, అంబూజా సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాలతో ఎంపీ చర్చించారు. రూ. 70 లక్షల వరకు ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యాలు ముందుకొచ్చాయి. అనంతరం ఎంపీ గణపర్తి- జోగారావుపేట గ్రామాల మధ్య రహదారిని పరిశీలించారు. సెజ్‌ కంపెనీల ప్రతినిధులు పి.సుధాకర్‌, త్రినాథరాజు, జలవనరులశాఖ ఏఈ హనుమంతరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని