close

మంగళవారం, ఆగస్టు 11, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
60 మంది డిశ్చార్జి

● చికిత్స పొందుతూ ఒకరి మృతి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కరోనా నుంచి కోలుకున్న 60 మందిని ఆదివారం జిల్లా సర్వజన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సుమారు 1500కు చేరగా- చికిత్స పొందుతున్న వారు 450 మంది వరకు ఉన్నారు. చికిత్స అనంతరం పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారిని డిశ్చార్జి చేస్తున్నారు. నగరంలో జీజీహెచ్‌తో పాటు కిమ్స్‌, సంఘమిత్ర ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులకు చికిత్స జరుగుతోంది. ఈ సందర్భంగా జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు మాట్లాడుతూ కిమ్స్‌, సంఘమిత్రలో కలిపి 15 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారంతా జీజీహెచ్‌లో ఉన్నారని తెలిపారు. మార్కాపురానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయినట్లు వెల్లడించారు. ఆయన ఈ నెల 7న ఆసుపత్రిలో చేరారని, న్యూమోనియాతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సోకడం వల్ల మృతి చెందినట్లు వివరించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33 మంది మృతి చెందారన్నారు. వారిలో కొందరు ఇతర వ్యాధులతో చేరారని, తర్వాత పరీక్షిస్తే పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఎక్కువ మంది ఇతర వ్యాధులు ఉండటం వల్లే మృతి చెందారని పేర్కొన్నారు.

కొత్తగా 139

జిల్లాలో ఆదివారం 139 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీఆర్‌డీఎల్‌, ట్రూనాట్‌ ల్యాబ్‌ నుంచి అందిన సమాచారం మేరకు.. ఒంగోలు, కోవూరు, టీబీవీ పాలెం, కొనకనమిట్ల, గడియపూడి, ఆర్‌వీజీ పల్లి, గిద్దలూరు, మార్కాపురం, తుమ్మల చెరువు, తర్లుబాడుల్లో కొత్త కేసులు వెలుగు చూశాయి. సీతానాగులవరం, చెన్నారెడ్డిపల్లి, పెదనాగులవరం, తువ్వపాడు, వేములపేట, ఇనమనమెళ్లూరు, గుడ్లూరు, కనిగిరి, సింగరాయకొండ, పెద్దారవీడు, కందుకూరు, పామూరు, యరజర్ల, దోర్నాల, కడవకుదురులోనూ నమోదయ్యాయి. చీరాల, కాకుమానుపల్లి, నల్లగుండ్ల, శాంతినగర్‌, అద్దంకి, మేదరమెట్ల, లింగసముద్రం, కావూరివారిపాలెం, తన్నీరువారిపాలెం, సీఎస్‌పురం, పేరాల, పొదిలి, దరిమడుగు గ్రామాల్లోనూ కొందరికి పాజిటివ్‌ వచ్చింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.