నేడు బాన్సువాడ బందు
eenadu telugu news
Published : 30/07/2021 03:08 IST

నేడు బాన్సువాడ బందు


బాన్సువాడలో ర్యాలీ నిర్వహిస్తున్న భాజపా నాయకులు

బాన్సువాడ, న్యూస్‌టుడే: యువకుడిపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ బంద్‌కు భాజపా నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలో గురువారం ర్యాలీగా తిరుగుతూ బందుకు సహకరించాలని వ్యాపారులను కోరారు. దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ర్యాలీలో లక్ష్మీనారాయణ, శంకర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సాయిబాబా, సాయిరెడ్డి, సురేష్‌, భాస్కర్‌, సాయికిరణ్‌, హన్మాండ్లుయాదవ్‌, రీతూసింగ్‌, గంగాధర్‌, అశ్విన్‌ తదితరులున్నారు.

కామారెడ్డి పట్టణం: జిల్లాకు చెందిన భాజపా నేతలు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. భాజపా నేత డా. మురళీధర్‌గౌడ్‌తో పాటు పలువురు నాయకులు దత్తాత్రేయను కలిసిన వారిలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని