Updated : 21/04/2021 02:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్థిక సమస్యలతో..

రాజంపేట: మండల కేంద్రానికి చెందిన తొడంగెల రాజు(32) మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజు కొంత కాలంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో బాధపడుతున్నారన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకున్నాడు. కుటుంబసభ్యులు చూసి కామారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారని తెలిపారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని