సచివాలయాల నిర్మాణాలకు రూ.60 కోట్లు విడుదల
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

సచివాలయాల నిర్మాణాలకు రూ.60 కోట్లు విడుదల

సంగం, న్యూస్‌టుడే : జిల్లాలో గ్రామ సచివాలయాలు, అనుబంధ భవన నిర్మాణాలకు అవసరమైన రూ.60 కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ జి.వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంగంలో రైతు భరోసా కేంద్రానికి అవసరమైన స్థలాన్ని డీఈఈ సుబ్బారెడ్డితో కలసి బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు నెలాఖరుకు వాటిని ప్రారంభించాలని సీఎం ఆదేశించారని, ఇందుకు అనుగుణంగా పనులను వేగంగా చేయిస్తామన్నారు. నిధుల లభ్యత కారణంగా గ్రామ సర్పంచుల సహకారంతో వేగంగా పూర్తి చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని