నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశం
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశం

సూళ్లూరుపేట: ఇలుపూరు ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులకు సంబంధించి నిధులు, సామగ్రి దుర్వినియోగం, తదితర అభియోగాలపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ కమిషనర్‌ చిన్న వీరభద్రుడు ఆదేశించారు. పాఠశాల నిధుల దుర్వియోగంపై గ్రామస్థులు విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన స్పందించారు. విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని డీఈవోను ఆదేశించారు. శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులందరూ అందుబాటులో ఉండాలని డీవైఈవో వెంకటేశ్వరరావు బుధవారం నోటీసులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని