త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి

సర్పంచులకు సూచనలిస్తున్న జడ్పీ సీఈవో సుశీల

నెల్లూరు గ్రామీణం: జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈవో సుశీల పేర్కొన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో గృహనిర్మాణ శాఖ, నగరపాలక సంస్థల అధికారులతో బుధవారం సమీక్షించారు. నగరంలోని అక్కచెరువుపాడు, వావిలేటిపాడు లేఅవుట్లలో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. డీఈ శ్రీహరిగోపాల్‌, నగరపాలక సంస్థ అడిషినల్‌ కమిషనర్‌ ప్రసాద్‌ తదితరులున్నారు.

గ్రామాభివృద్ధికి పాటుపడాలి.. : నగరంలోని హరితా పర్యాటకశాఖ హోటల్‌లో బుధవారం సర్పంచులకు రెండు విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. డీపీవో ధనలక్ష్మి, జడ్పీ సీఈవో సుశీల ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. సర్పంచుల విధులు, వారి హక్కులపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని