పోలీసుల అదుపులో నిందితులు?
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

పోలీసుల అదుపులో నిందితులు?

నెల్లూరు(నేర విభాగం): బుజబుజనెల్లూరులో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను వేదాయపాలెం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పాతకక్షల నేపథ్యంలో సంపత్‌ను అదే ప్రాంతానికి చెందిన సూర్య అలియాజ్‌ సూరి, మునిస్వామి, మరికొందరు దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఘటనపై వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్‌ పి.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై లక్ష్మణరావు సిబ్బందితో కలిసి నిందితులకోసం గాలించారు. ప్రధాన నిందితుడితో సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని