జాబ్‌ క్యాలెండర్‌ రద్దుకు డిమాండ్‌
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

జాబ్‌ క్యాలెండర్‌ రద్దుకు డిమాండ్‌

నిరసన తెలుపుతున్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతతో ప్రభుత్వం ఆటలాడుతోందని.. జాబ్‌ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆ సంఘం జాతీయ కార్యదర్శి నగేష్‌ కరియప్ప, సమన్వయకర్త సంపత్‌రాజుతో కలిసి బుధవారం నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వాస్తవ గణాంకాలతో కొత్త క్యాలెండర్‌ విడుదల చేయని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం హరనాథపురంలోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థ ముందు ఆందోళన చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వై.రాజా, నాయకులు మహేష్‌, జశ్వంత్‌, బాషా, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని