బాధితులపైనే కేసులా?: తెదేపా 
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

బాధితులపైనే కేసులా?: తెదేపా 


మాట్లాడుతున్న నెల్లూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు అజీజ్‌

 

నెల్లూరు(ఇరిగేషన్‌) : వైకాపా నాయకుల చేతిలో దాడికి గురైన వారిపైనే కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడు తనానికి నిదర్శనమని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు, అబ్దుల్‌ అజీజ్‌, నగర బాధ్యుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. అధికార పార్టీ నాయకులు అక్రమంగా చేపట్టిన మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించి వస్తున్న ఆయనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమవడంతోనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి మెప్పు, మంత్రివర్గంలో స్థానం కోసం వైకాపా ఎమ్మెల్యేలు హద్దుమీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాయకులు సంపత్‌ యాదవ్‌, షాబీర్‌ ఖాన్‌, రమణయ్య, సుధాకర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని