రహదార్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు 
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

రహదార్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు 

కావలి, న్యూస్‌టుడే : గతేడాది చివరిలో నివర్‌ తుపాను వల్ల దెబ్బతిన్న రహదార్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న ‘నివర్‌ నష్టాలు పూడ్చేదెవరు!’ అనే శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. వరద నష్టపరిహారంగా చేపట్టాల్సిన పనులను ఇతర ఏదైనా నిధుల ద్వారా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు తమకు ఆదేశాలు వచ్చాయని పంచాయతీరాజ్‌ కావలి మండల సహాయక ఇంజినీర్‌ నాగశంకర్‌ సింగ్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని