లబ్ధి @ 62,061 మంది
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

లబ్ధి @ 62,061 మంది

జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల నేడు


దగదర్తి మండలం దుండిగం సచివాలయంలో దస్త్రాలు పరిశీలిస్తున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర కళాశాలల్లో డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, క్రిస్టియన్‌ వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యా దీవెన (బోధన రుసుం) కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం విడుదల చేయనున్నారు. నెల్లూరు తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి రెండో విడతకు జిల్లాలో 62,061 మంది విద్యార్థులకు రూ.43,23,84,046 నిధులు విడుదల చేయనున్నారు. ఇవి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాకు జమ కానున్నాయి. తొలి విడత నిధులు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేశారు. వీటిలో 61,578 మంది విద్యార్థులకు రూ.41,76,65,267 నిధులు విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన కింద అందించే ఈ నిధులను ఆయా కళాశాలల్లో ఎంతైతే ఫీజులు ఉంటాయో ఆ మేరకు ప్రభుత్వం దఫాల వారీగా ప్రభుత్వం విడుదల చేయనుంది. తల్లులు తమ ఖాతాల నుంచి నిధులు తీసి ఆయా కళాశాలల్లో చెల్లించాల్సి ఉంది. ఆయా కళాశాలల్లో అందించే బోధనలు, వసతులు, ఇతర సౌకర్యాలను తల్లిదండ్రులు పరిశీలించి ప్రశ్నించవచ్చని అధికారులు వివరిస్తున్నారు.

బయోమెట్రిక్‌ సేకరణ

జగనన్న విద్యా దీవెనకు ఆయా సచివాలయాల్లోని వాలంటీర్ల ద్వారా విద్యార్థులు, తల్లుల బయోమెట్రిక్‌ను సేకరించారు. ఈనెల 17వ తేదీ అర్హులు, అనర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి 23వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్ల ద్వారా ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. 24వ తేదీ జ్ఞానభూమి పోర్టల్‌లో పొందు పరిచి 29వ తేదీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేస్తున్నారు.

తల్లుల ఖాతాలకే..

- చెన్నయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి

- వెంకటయ్య, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి

జగనన్న రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం విడుదల చేయనున్నారు. ఈ నిధులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాకే జమవుతాయి. తిక్కన ప్రాంగణంలో అధికారులు, పలువురు పాల్గొననున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని