ఇసుక కొల్లగొట్టారు
logo
Published : 25/06/2021 04:31 IST

ఇసుక కొల్లగొట్టారు

తెదేపా నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి


ఎస్‌ఈతో మాట్లాడుతున్న కోటంరెడ్డి

నెల్లూరు(ఇరిగేషన్‌), న్యూస్‌టుడే: పెన్నానది నుంచి రూ. వంద కోట్ల విలువైన ఇసుకను తరలించారని తెదేపా నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఇసుక అనుమతులపై ఒక్కో అధికారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం నీటిపారుదలశాఖ ఎస్‌ఈ కార్యాయలయం ముందు తెదేపా నాయకులు నిరసన తెలిపారు. కోటంరెడ్డి, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్‌ ఎస్‌ఈ కృష్ణారావును కలిసి పలు అంశాలు వివరించారు. పెన్నానదిలో కొన్ని నెలలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, అసలు అక్కడ తవ్వకాలకు నీటిపారుదలశాఖ ఏ విధంగా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ఆయా అక్రమాలపై విచారణ జరిపి ఈఈ, డీఈ, ఏఈలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సహజ వనరుల దోపిడీకి కొందరు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక అనధికార తరలింపునకు మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇసుక దోపిడీని తాము సంబంధిత ఆధారాలతో నిరూపిస్తామని అన్నారు. నీటిపారుదలశాఖ నదిలో మట్టి తరలింపునకు 24 రోజుల కిందటే అనుమతులు ఇచ్చామని అంటుంటే.. తహసీల్దారు అనుమతులు లేవంటున్నారని, మరో డీఈ అసలు తరలించనేలేదంటున్నారని ఆక్షేపించారు. అఖిలపక్ష సమావేశమంటూ మంత్రి కొత్త నాటకానికి తెరదీశారని, జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాను ఎక్కడికైనా వస్తానని శ్రీనివాసులురెడ్డి సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ మామిడాల మధు, మహేంద్రరెడ్డి, వెంకయ్య యాదవ్‌, ఖజావల్లి, పలువురు నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని