కనీస వేతనాల అమలుకు చర్యలు
logo
Published : 25/06/2021 04:31 IST

కనీస వేతనాల అమలుకు చర్యలు


మాట్లాడుతున్న కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్‌ఎంఆర్‌, దినసరి కూలీలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కనీస వేతనాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కార్మికశాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి ఎన్‌ఎంఆర్‌, దినసరి కూలీలకు కనీస వేతనాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికశాఖ ప్రతిపాదించిన కనీస వేతనాలను కమిటీ ఆమోదించిందన్నారు. అన్‌స్కిల్‌ కార్మికులకు రోజుకు రూ.456, సెమి స్కిల్‌ రూ.545, స్కిల్‌ రూ.651, హైస్కిల్‌ రూ.744గా కమిటీ నిర్ణయించిందని వివరించారు. ఈ సమావేశంలో జేసీ హరేంధిరప్రసాద్‌, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్‌, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ సత్యనారాయణ, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సురేష్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రత్నం, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని