ఆలయ అభివృద్ధి పనుల తనిఖీ
logo
Published : 25/06/2021 04:31 IST

ఆలయ అభివృద్ధి పనుల తనిఖీ


వివరాలు తెలుసుకొంటున్నచంద్రశేఖర్‌ ఆజాద్‌

బిట్రగుంట, న్యూస్‌టుడే : బిలకూటక్షేత్రం కొండబిట్రగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌(ఎస్టేట్‌) చంద్రశేఖర్‌ ఆజాద్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీవారి రథం, పుష్కరిణి, తూర్పు రాజగోపురం వంటి అనేక అభివృద్ధి పనులు దాతల సహకారంతో దేవాదాయశాఖ చేపట్టింది. పనులు పర్యవేక్షించిన ఆయన ఈవో రాధాకృష్ణ, ఛైర్మన్‌ శ్రీరామ్‌మాల్యాద్రితో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లా సహాయ కమిషనర్‌ శ్రీనివాసులురెడ్డి, డీఈ జనార్ధన్‌, స్థపతి సురేంద్ర ఉన్నారు. ప్రసన్నుడికి జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని