టిప్పర్‌ ఢీకొని వృద్ధురాలి మృతి
logo
Published : 25/06/2021 04:31 IST

టిప్పర్‌ ఢీకొని వృద్ధురాలి మృతి


టిప్పర్‌ కింద మృతిచెందిన మహిళ

వేగూరు (కోవూరు), న్యూస్‌టుడే : ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి వెళ్తుండగా మృత్యురూపంలో వచ్చిన టిప్పర్‌ వెనక నుంచి ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన కోవూరు మండలంలోని వేగూరు-సుబ్బారెడ్డిపురం రహదారి మధ్యలో గురువారం చోటు చేసుకుంది. కోవూరు ఏఎస్సై మూర్తి తెలిపిన వివరాల మేరకు.. విడవలూరు మండలంలోని మన్మథరావుపేట గ్రామానికి చెందిన ఈగ గోవిందమ్మ (64) ఆరోగ్యం సరిగలేకపోవడంతో తమ చెల్లెలి కొడుకు అశోక్‌కుమార్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో నెల్లూరుకు బయలుదేరారు. ఇంటి నుంచి బయలు దేరిన కొద్దిసేపట్లోనే వేగూరు- సుబ్బారెడ్డిపురం వద్ద వేగంగా వచ్చిన టిప్పర్‌ వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. అశోక్‌కుమార్‌కు గాయాలు కావడంతో ఆతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. ఎస్సై చింతం కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని