బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి
logo
Published : 25/06/2021 04:31 IST

బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి


పాల్గొన్న జిల్లా పోలీసు అధికారులు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : ప్రతి మహిళ.. యువతి.. విద్యార్థిని కచ్చితంగా ‘దిశ’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జిల్లా పోలీసులను సూచించారు. గురువారం దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన వీసీ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకట రత్నం, దిశ, గూడూరు డీఎస్పీలు ఉప్పుటూరి నాగరాజు, రాజగోపాల్‌ రెడ్డి, దిశ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రమణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళలు, యువత, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దిశ యాప్‌ ప్రతిఒక్కరూ వినియోగించే దిశగా అయిదు రోజుల పాటు ప్రత్యేక స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని