భూసేకరణపై జేసీ విచారణ
logo
Published : 25/06/2021 04:31 IST

భూసేకరణపై జేసీ విచారణ


దస్త్రాలను పరిశీలిస్తున్న జేసీ హరేంధిర ప్రసాద్‌

పెళ్లకూరు, న్యూస్‌టుడే: నాయుడుపేట- రేణిగుంట జాతీయ రహదారి భూ సేకరణపై సంయుక్త కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ గురువారం విచారణ చేపట్టారు. పెన్నేపల్లి రెవెన్యూలో ఇద్దరు రైతులు రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్నా.. పరిహార జాబితాలో వారి పేర్లు లేకపోవడంపై ఇటీవల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జేసీ గ్రామానికి చేరుకొని భూ దస్త్రాలు పరిశీలించారు. అర్హులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయుడుపేట ఆర్డీవో సరోజిని, తహసీల్దార్‌ సుందరమ్మ, డీటీ శ్రీనివాసులు తదితరులున్నారు.● జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని తెలుగు రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కందమూడి శివకుమార్‌ జేసీ, ఆర్డీవోకు విన్నవించారు. గ్రామసభలు ఏర్పాటు చేసి అక్కడే ధరలు నిర్ణయించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని