కస్తూర్బా గాంధీ ఆశ్రమం చేరిన ఆశ
logo
Published : 25/06/2021 04:31 IST

కస్తూర్బా గాంధీ ఆశ్రమం చేరిన ఆశ


కుమారుడితో ఆశ్రయం పొందుతున్న బాధితురాలు

సీతానగరం, న్యూస్‌టుడే: అత్తింటి వేధింపులు, హత్యాయత్నం ఘటన నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలిని వైద్య చికిత్స అనంతరం కస్తూర్బాగాంధీ ఆశ్రమానికి గురువారం చేర్చి రక్షణ కల్పించారు. నెల్లూరు జిల్లా కడవలూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఎస్‌కే ఆశ(25)... తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన కర్రి అభిరామ్‌(26) హైదరాబాద్‌ చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా భార్యను ఇంట్లోనే బంధించి భర్తతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేయడం, హత్యాయత్నం నుంచి తప్పించుకుని బుధవారం ఆశ పోలీసులను ఆశ్రయించడం, ఈ నేపథ్యంలో కేసు నమోదు అయిన విషయం విదితమే. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్స అనంతరం సీతానగరంలోని కస్తూర్బా గాంధీ అశ్రమంలో తాత్కాలికంగా ఉండేలా బాధితురాలిని చేర్పించినట్లు ఎస్సై వై.సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ... చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయానని, నా అనేవారు లేకుండా రెండేళ్ల బిడ్డతో కలిసి చేస్తున్న ఈ పోరాటానికి ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. దాతల సహకారంతో తాత్కాలికంగా ఆశ్రమంలో నీడ కల్పించారని, బయటకు పంపిస్తే చేతిలో చిల్లిగవ్వ లేదని, ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితని కన్నీటి పర్యంతమయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని