15,200 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం : ఏజేడీ
logo
Published : 25/06/2021 04:31 IST

15,200 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం : ఏజేడీ


మాట్లాడుతున్న వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఆనందకుమారి

మనుబోలు, న్యూస్‌టుడే : జిల్లాలో 15,200 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేశామని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఆనందకుమారి పేర్కొన్నారు. మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వీఏఏలకు వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. 7,600 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఖరీఫ్‌ సీీజన్‌లో జిల్లాలో ఇప్పటి వరకు 28 వేల హెక్టార్లల్లో వరిసాగు చేస్తున్నారన్నారు. మరో 8 వేల హెక్టార్లలో వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్‌, వ్యవసాయాధికారి జపీీార్‌, ఎంపీీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని